— శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్
Council Member Shankar Nayak : ప్రజా దీవెన నల్లగొండ: ప్రజా సమ స్యలను చర్చించేందుకు సరియైన వేదిక శాసనసభ మాత్రమేనని, ద మ్ముంటే కెసిఆర్ అసెంబ్లీకొచ్చి మా ట్లాడాలని శాసన మండలి సభ్యు లు శంకర్ నాయక్ డిమాండ్ చేశా రు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పై చర్చించాలి కానీ అధికారంలో ఉ న్నప్పుడు దోచుకుని అధికారం కో ల్పోయిన తర్వాత కెసిఆర్ కేటీ ఆర్, హరీష్ రావు ఇష్టం వచ్చిన ట్టుగా మాట్లాడుతున్నారని ద్వజ మెత్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి క్యాంపు కార్యాలయంలో బు ధవారం నిర్వహించిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దండుకుతిన్నారని, కాళేశ్వ రం కాస్తా కూలేశ్వరం అయిందని ఆరోపించారు. గతంలో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది మీరు కాదా అ ని ప్రశ్నించారు.
నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులకు నిధు లు కేటాయించకుండా వివక్షత చూ పారని, ఆంధ్రకు నీళ్లు ఇవ్వడానికి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తి న్నది మీరు కాదా అన్నారు. అధి కారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన ట్లు చేసి ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామా అని హెచ్చరించారు.
మేము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తు న్నా మని, కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, బ డుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా మని వివరించారు.
బనకచర్ల, కృష్ణ జలాలపై మాట్లా డాల్సింది ఎక్కడపడితే అక్కడ కాదని, అసెంబ్లీలో చర్చిస్తేనే సరి యైన సమాచారం ప్రజల్లోకి వెళ్లి గందరగోళానికి తెరపడుతుందని చెప్పారు. అయినప్పటికీ కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లా డుతున్నాడని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ హయంలో ఉద్యోగాల భ ర్తీ చేస్తామని చెప్పిన వారు అన్ని లీ కేజీలు చేశారని, ఉద్యోగాలు భర్తీ చే యకుండా నిరుద్యోగులను ఎన్నో ఇ బ్బందులు గురి చేశారని గుర్తు చేశా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యో గాలను భర్తీ చేసిందని, ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు కేటా యించిందని, పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందని వివరిం చారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా మం జూరు చేయలేదని, కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రా మంలో పేదలకు ఇండ్లు మంజూరు చేసిందన్నారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ మతిభ్రమించి మా ట్లాడుతున్నాడని, అతన్ని ఎర్రగడ్డ ఆసుపత్రి చికిత్సకు పంపించాలని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలపై వారికి అవగాహన ఉంటే అసెంబ్లీ వచ్చి మాట్లాడాలని పునరుద్ఘాటిం చారు. ఈ మీడియా సమావేశంలో
గుమ్ముల మోహన్ రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్,వంగూరి లక్ష్మయ్య, జూకూరిరమేష్, కత్తుల కోటి తదితరులు ఉన్నారు.