**రైతుల దగ్గర అమలు వాళ్ళు డబ్బులు వసూలు చేయొద్దు..
**ఐకెపి నిర్వాహకులే హమాలి వాళ్లకు కాంట డబ్బులు వసూలు చేసి ఇవ్వాలే..
పిడి శేఖర్ రెడ్డి..
IKP Center : ప్రజా దీవెన ,కనగల్ : ఐకెపి కొనుగోలు కేంద్రాలలో పిడి శేఖర్ రెడ్డి చర్లగౌరారం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు.
మండలంలోని దేపరెడ్డిగూడెం, లింగాలగూడెం, రేగట్టే, బోయినపల్లి, గ్రామాలలో అధికారులు ఏవో బెజవాడ అమరేందర్ గౌడ్ ఏపిఎం హరి కలిసి ఐకెపి కేంద్రాలను ప్రారంభం చేశారు ఆయా కార్యక్రమంలో సిఆర్పి జానకి సీసీలు విజయ కుమారి నాయకులు రాజిరెడ్డి, మాజీ సర్పంచులు గోలి జగాల్ రెడ్డి ,విబికే లు బిచ్చల రాణి, తొరకొప్పుల రజిత ,ఏటీఎం నాగరాజు, తదితరులు పాల్గొన్నారు