— బిజెపి నల్లగొండ వన్ టౌన్ అధ్యక్షులు గడ్డం మహేష్
Illegal Arrests Incompetence :ప్రజాదీవెన నల్గొండ :తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతున్న సందర్భంగా వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు నల్లగొండ జిల్లా లోని పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ అందాలను వీక్షించేందుకు విచ్చేస్తున్న సందర్భంలో బిజెపి మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు రావిళ్ల కాశమ్మా, ముంత పద్మ, స్వాతి లను అక్రమంగా అరెస్ట్ చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజెపి నల్లగొండ వన్ టౌన్ అధ్యక్షులు గడ్డం మహేష్ పేర్కొన్నారు.
బిజెపి మహిళా మోర్చా నాయకురాళ్ళ ను
నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం తెలుసుకున్న బిజెపి పట్టణ వన్ టౌన్ అధ్యక్షులు గడ్డం మహేష్, నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి బిజెపి మహిళా మోర్చ నాయకురాళ్లను కలిసి వారికి సంఘిభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా మహిళలు అని చూడకుండా అరెస్టులు చేయించడం రాష్ట్ర ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి అక్రమ అరెస్ట్ లకు బిజెపి నాయకులు భయపడేది లేదని, ఎదురు నిలబడి ప్రజల కోసం ప్రభుత్వం పై పోరాటం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి పకీరు మోహన్ రెడ్డి, అక్కనెపల్లి బలరాం, వెన్నమల్ల మహేష్, దాసరి కృష్ణ, పుట్టల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.