Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IMD : తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ

IMD : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ అధికారులు. మంగళవారం బుధవారం రెండు రోజుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. శ్రీలంక కింద ఒక అల్పపీడనం ఏర్పడుతుండ టంతో తమిళనాడుకు బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో తమి ళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీ ప్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలి పింది. ఏపీ, తెలంగాణకు మాత్రం వర్ష సూచన లేనప్పటికీ చలి విప రీతంగా పెరుగుతుందని అధికా రులు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీలైనంత వరకు రాత్రిళ్లు ఇళ్ల నుంచి బయటకు రావ ద్దంటూ సూచించారు. శాటి లైట్ అంచనాల ప్రకారం నేడు తెలుగు రాష్ట్రాల్లోమేఘాలు చాలా తక్కు వగా ఉంటాయి. రోజంతా పొడి వాతావరణం ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరుగుతుంది. ఏపీ కంటే తెలం గాణలో చలి మరింత ఎక్కువగా ఉంటుంది. గాలివేగం బంగాళాఖా తంలో గంటకు 30కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో ఇది గంటకు 14కిలోమీటర్లుగా ఉంటుంది.

         తెలంగాణలో గంటకు 11కిలోమీ టర్లు ఉంటుంది. ప్రస్తుతం గాలుల న్నీ శ్రీలంకవైపే వీస్తున్నాయి. అక్క డ అల్పపీడనం పెద్దగా ఏర్పడే అవ కాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు తెలు గు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతు న్నాయి. నేడు తెలంగాణలో పగటి వేళ 30 డిగ్రీల సెల్సియస్ ఉం టుం ది. ఏపీలో 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రివేళ తెలంగాణలో 17 డిగ్రీలు, ఏపీలో 19 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని ఐఎండీ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ, అడవి ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. పగటివేళ కంటే రాత్రివేళ తేమ బాగా పెరుగుతుందని..రాత్రిళ్లు చలి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ తెలిపింది. పిల్లలు, ముసలివారు, ఆస్తమా బాధితులు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.