Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anti-Worker Labour : కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి

–ప్రజాసంఘాల నాయకులు

–సమ్మెతో కేంద్రానికి కనువిప్పు కలగాలి

–పట్టణంలో పలుచోట్ల నిరసన ర్యాలీలు

–పెద్ద గడియారం సెంటర్లో సభ

Anti-Worker Labour  : ప్రజాదీవెన నల్గొండ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సమ్మె తో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వెంటనే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న లు డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు, ఏఐటీయూసీ, ఐ ఎన్టియుసి, బిఆర్టియు, ఐఎఫ్టియు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ ల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. వివిధ రంగాల కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహించి పెద్ద గడియారానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడు ముందుకు తెచ్చిందని అన్నారు.

 

పారిశ్రామిక సంబంధాల కోడ్ ద్వారా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ను చట్టబద్ధం చేసి రెగ్యులర్ ఉద్యోగుల భద్రతకు ముప్పు తెచ్చిందని ఆరోపించారు. ట్రేడ్ యూనియన్లను ఉద్యోగుల కార్మికుల సంఘటిత శక్తిని బలహీన పరుస్తుందని అన్నారు. లేబర్ కోడ్ ప్రకారం యాజమాన్యాలు సర్వీస్ కండిషన్స్ మార్చాలనుకుంటే ముందస్తు నోటీసు ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని పారిశ్రామిక సంబంధాల కోడ్ అమనైతే 300 మంది లోపు పని చేసే పారిశ్రామిక సంస్థల్లో యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి లేకుండానే యదేచ్చగా కార్మికులను తొలగించవచ్చని పేర్కొన్నారు. ఏర్పాటు రిజిస్ట్రేషన్ లను కఠిన తరం చేస్తుందని మండిపడ్డారు. కార్మికులు సమ్మె చేయడం సాధ్యం కాకుండా ఆంక్షలు విధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక భద్రత కోడ్ అమలు వల్ల ఉద్యోగులు పొందే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12 నుండి 10 శాతానికి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల కోడు లో కనీస వేతనం నిర్ణయించడానికి ఎలాంటి శాస్త్రీయత ప్రతిపాదన లేదు. డాక్టర్ ఆత్రాయుడు ఫార్ములాను తుంగలో తొక్కారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం 26000 అమలు చేయాలని డిమాండ్ చేశారు.


ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు, బి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు ఆర్ ఆచారి మాట్లాడుతూ దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉన్నదని అన్నారు. ప్రజల ఆస్తులను కార్పోరేట్లకు దోచిపెడుతూ మతోన్మాద చర్యల ద్వారా కార్మిక వర్గ ఐక్యతను విచ్చిన్నం చేసే చర్యలకు ప్రతిఘటించేందుకు సమ్మె పిలుపు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతమైందని కేంద్రానికి ఈ సమ్మె ద్వారా కనువిప్పు కలగాలని, వెంటనే కేంద్ర బిజెపి ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలని లేనియెడల తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు కేఎస్ రెడ్డి, ఐ ఎన్ టి యు సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి. మొయినుద్దీన్, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, టౌన్ కన్వీనర్ అవుటర్ రవీందర్, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి దొనకొండ వెంకటేశ్వర్లు, పి. వెంకట్రావు, ఐఎన్టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బొంగురాల నరసింహ, బ్యాంక్ ఎంప్లాయిస్ నాయకులు ఈశ్వర్, అలీముద్దీన్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మిట్టపల్లి నందం, శ్యాంసుందర్, వివిధ సంఘాల నాయకులు విజయలక్ష్మి, గీతా రాణి, మల్లీశ్వరి, భిక్షం, అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, గుండె రవి, ఎన్ ఆర్ సి రాజు, కోట్ల అశోక్ రెడ్డి, గంజి నాగరాజు, రవి, సాగర్ల మల్లయ్య, సరిత, కందుల నరసింహ, యాదయ్య, జానీ, సౌజన్య , వి. లెనిన్, పెరిక కృష్ణ, పేర్ల సంజీవ, ప్రేమలత, మిరియాల శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.