టి పి యు ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అలుగుబెల్లి పాపిరెడ్డి..
Alugubelli Papireddy : శాలిగౌరారం జూలై 16. : అధికారం లోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకు పెండింగ్ డి ఏ లను పరిష్కరించి, పి ఆర్ సి ని ప్రకటిస్తామని మాట ఇచ్చి, విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ముందుంటుదని టి పి యు ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అలుగుబెల్లి పాపిరెడ్డి అన్నారు.శాలిగౌరారం టి పి యు ఎస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ..
శాలిగౌరారం లోని వివిధ పాఠశాలలను సందర్శించిన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అలుగుపల్లి పాపి రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వం లో ప్రతీ ఉపాధ్యాయుడి భాగస్వామ్యం కావాలని టి పి యు ఎస్ ను పెద్ద ఎత్తున బలోపేతం కావడానికి కృషి చేయాలని కోరారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్, శాలిగౌరారం , కేతపల్లి, కట్టంగూర్ మండలాల బాధ్యులు అనంతుల వెంకటేశ్వర్లు, వాణి, పాండరి,దాసరి శంకర్, యాదగిరి, కృష్ణ ,నాయకులు మధుసూదన్ పాల్గొన్నారు.