–సిఐటియు
Migrant Workers : ప్రజాదీవెన నల్గొండ : వలస కార్మికుల రక్షణ కోసం ఏర్పాటు అయినా 1979 వలస కార్మిక చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం దొడ్డి కొమరయ్య భవన్ లో భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతాల్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వస్తున్న కార్మికుల సంఖ్యను లేబర్ అధికారులు నమోదు చేయాలని, వారికి యాజమాన్యాలు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల ను పరిశీలించి దోపిడీకి గురికాకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్మికులలో పోటీ తత్వాన్ని యాజమాన్యాలు ఉపయోగించుకొని తక్కువ వేతనాలు ఇస్తూ ఎక్కువ పని గంటలు చేయించుకోకుండా లేబర్ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.
పనిగంటలు వేతనాలు అందరికీ సమానంగా వర్తించాలని వలస కార్మికులకు అదనంగా నివాసాలు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. వలస కార్మికులు ప్రమాదాలకు గురైనప్పుడు ఎలాంటి నష్టపరిహారం లేకుండా కుటుంబాలు అనాధలుగా మారుతున్న పరిస్థితి ఉందని అన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో వలస కార్మికులందరినీ నమోదు చేసి సంక్షేమ పథకాలు అందే విధంగా కార్మిక శాఖ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు సయ్యద్ హాశం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సలివొజు సైదాచారి, అద్దంకి నరసింహ, అశోక్ గుప్తా, సూరజ్ పటేల్, ప్రేమ్, సోహెల్, హజరత్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.