Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana government: తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు, సర్కార్ స్కూళ్లలో టీచర్లకు ఝలక్

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశా లల్లో టీచర్లు సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని, అధికారులకు సమాచారం వచ్చింది, ఈ మేరకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది, ఆయా పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల ఫొటోలను అందరికీ కనిపించే విధంగా బడుల్లో ప్రదర్శించాలని పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ తెలిపారు. ఈ మేరకు చర్యలు చేప ట్టాలని ఆదేశించారు. అలాగే కొన్ని పాఠ శాలల్లో ప్రభుత్వం నియమించిన టీచర్ల స్థానంలో ఇతర ప్రైవేట్ వ్యక్తు లు పనిచేస్తున్నారని, విద్యా శాఖకు ఫిర్యాదులు అందాయని. ఇలా ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు.

ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉ పాధ్యాయులు తమ ఫొటోలను ఆ యా పాఠశాలల్లో ప్రదర్శించాలని కేంద్ర విద్యాశాఖ పలు మార్లు ఆదే శించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కూడా పాఠ శాలల్లో టీచర్ల ఫొటోలు ప్రదర్శిం చాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొందరు సీనియర్‌ టీచర్లు ఆయా గ్రామాల కు చెందిన యువతీ యువకులకు రూ.10 వేల వరకు ఇచ్చి, వారిని బోధకులుగా నియ మించినట్లు తమ దృష్టికి వచ్చిం దని.. ఇదే తరహాలో హైదరాబాద్‌ తో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉపా ధ్యాయు లకు ఇతర డ్యూటీ (ఓడీ) సౌకర్యం లేకున్నా పాఠశాలలకు నెలల తర బడి హాజరు కావడం లేదన్న ఆరోపణలు వెళ్లువె త్తుతున్నాయి. హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలో ఇదే మాదిరి ప్రైవేట్ వ్యక్తులు టీచర్లుగా పనిచే స్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ విధమైన తప్పిదా లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, తప్పనిసరిగా అన్ని పాఠశాలలు తమ ప్రాంగణాల్లో అక్కడ పనిచేసే టీచర్ల ఫొటోలను ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అదేశించింది.