Imprisonment in rape case అత్యాచారం కేసులో జైలు శిక్ష
అత్యాచారం కేసులో జైలు శిక్ష
ప్రజా దీవెన/రంగారెడ్డి: రoగారెడ్డి జిల్లా లో మతి స్థిమితం లేని మూగ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది. షాద్‌నగర్‌కు చెందిన దేవర సాయిలు (25) కందుకూరులో ఉండేవాడు. 2018 ఆగస్టు 11న ఓ గ్రామంలోని బాలిక(14)పై అత్యాచారం చేసి పారిపోయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కందుకూరు పోలీసులు నిందితుడిని రిమాండుకు తరలించారు.
దర్యాప్తు అనంతరం అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి శిక్ష ఖరారు చేశారు. బాధితురాలికి రూ.8 లక్షల పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సూచించారు.