తెలుగుదేశం పార్టీ మునుగోడు ఇంచార్జ్ బడుగు లక్ష్మయ్య
In-charge Badugu Lakshmaiah : ప్రజా దీవెన నాంపల్లి : చౌటుప్పల్ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భీమి డి మోహన్ రెడ్డి ఆశయాలను సాధించాలని చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య అన్నారు ఆయన చౌటుప్పల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భీమిడి మోహన్ రెడ్డి 28వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన చిత్రపటానికి పూలమాలని వేసి నివాళులర్పించారు మోహన్ రెడ్డి చౌటుప్పల్ మండలాన్ని వ్యవసాయం మార్కెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని మాజీ మంత్రి ఎలిమినేట్ మాధవరెడ్డి సహాయ సహకారాలు మార్కెట్ రంగాన్ని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేశాడని అన్నారు కార్యకర్తలు పార్టీలో పని చేయకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసేవారు .
అందుకు భీమీడి మోహన్ రెడ్డి చేసిన సేవలను ఆశయాలను సాధించాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు రాబోవు కాలంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అందుకు నియోజకవర్గంలోని కార్యకర్తలు పార్టీ ప్రతిష్టల కోసం పనిచేయాలని ప్రజల అవసరాలను గుర్తించి పోరాడాలని కోరారు ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల పార్టీ కార్యదర్శి పూరకాల వెంకటేష్ గౌడ్ మున్సిపల్ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్ సీనియర్ నాయకులు గుమ్మడి అంజిరెడ్డి తడక కోటేష్ మండల బి సి సెల్ అధ్యక్షులు గోవిందా చారి గోశిక పాండు చిలువేరు రాజు పుప్పాలపాడు అధ్యక్షులు నూనె వెంకటేష్ నాదపట్ల అధ్యక్షులు గుర్రం నరసింహ పాల్గొని భీముడి మోహన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పిచ్చి ఆశయాలు సాధిస్తామని అన్నారు