డ్రాప్స్ అవుట్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధ్యాపకులదే
టీసీలు ఆధార్ కార్డులు ఉన్న వారికే అడ్మిషన్లు ఉంటాయి.
Government College Admissions : ప్రజాదీవెన, సూర్యాపేట : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు పెంచే బాధ్యత అధ్యాపకులు తీసుకోవాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ భీమ్ సింగ్ అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తూ వివిధ కళాశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నిమికల్ లో ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో భారీగా అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 154 అడ్మిషన్లు అయ్యాయని తెలిపారు ప్రతి విద్యార్థి పై అధ్యాపకులు శ్రద్ధ తీసుకొని ఉత్తీర్ణత పెంచేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రణాళిక బద్దంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు ప్రతిరోజు కళాశాలకు విద్యార్థులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు డ్రాప్ అవుట్సు ఫలితాలు రావని అందుకని ప్రారంభం నుంచే చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని అధ్యాపకులకు సూచించారు.
ఇప్పటివరకు వచ్చిన అడ్మిషన్లకు ఇంకా 15 రోజుల్లో వచ్చే అడ్మిషన్లకు సంబంధించిన టీసీలను ఆయా పాఠశాలల నుంచి తెప్పించుకోవాలని వివరించారు ఈ నెలలో అడ్మిషన్లు పెంచే బాధ్యతలను సమిష్టిగా తీసుకొని బాధ్యతతో అధ్యాపకులు వ్యవహరించాలని ఆదేశించారు. వార్షిక పరీక్షల నాటికి ప్రతి విద్యార్థి పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలు రాయాలని అందుకోసం ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానం ఉంటుందని అందులో ఎటువంటి బేసిజాలు ఉండవని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డ్ కమిషనర్ ఇప్పటికే రాష్ట్రంలో 81 మందికి ప్రిన్సిపాల్ గా పదోన్నతులు కల్పించి కళాశాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ప్రతి కళాశాలలో మౌలిక వసతుల కోసం కళాశాల ప్రిన్సిపాల్ నుండి వచ్చిన నివేదికల ద్వారా పరిశీలించి అన్ని కళాశాలలో ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.
టీసీలు తప్పనిసరి
………. అడ్మిషన్లు చేసిన విద్యార్థుల యొక్క టీసీలు తప్పనిసరిగా కళాశాలలో ఇవ్వాలని తెలిపారు టీసీలు లేకుండా విద్యార్థుల అడ్మిషన్లు ఉండవని వెల్లడించారు ఈ నెల 31 వరకు టీసీలు తెప్పించాలని అధ్యాపకులను కోరారు లేనియెడల అడ్మిషన్లను డిలీట్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నిమికల్ ప్రిన్సిపల్ మారం హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుంగతుర్తి ప్రిన్సిపాల్ రాజమోహన్ కళాశాల అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు