Parliament elections ఇండియా కూటమిదే అధికారం
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆదరణ పూర్తిగా తగ్గియిపో యిందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగో పాల్ స్పష్టం చేశారు.
కష్టపడే వారికే తగు ప్రాధాన్యత కట్టబెడుతాం
కాంగ్రెస్ పార్టీ నేతలతో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆదరణ పూర్తిగా తగ్గియిపో యిందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగో పాల్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎంపీ స్థానాల గెలుపుపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, దానికి అనుగుణంగా పనిచేయాలని సూటిగా ఆదేశించా రు.
మంగళవారం పార్టీ ఎంపీ అభ్య ర్థులు, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి జూమ్ ద్వారా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ దేశం దిశ, దశ మార్చే ఈ లోక్‌సభ ఎన్నిక లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గట్టిగా పని చేయాలని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ఉపే క్షించేది లేదని స్పష్టం చేశారు. పని తీరును బట్టే పదవులు ఉంటాయ న్న సంకేతాన్నీ ఇచ్చారు.
బీజేపీ బలంగా ఉందంటున్న ఉత్తరాది రాష్ట్రాల్లో అనూహ్యమైన మా ర్పులు చోటు చేసుకున్నాయని, ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీని పూర్తి స్థాయిలో కట్డడి చేయ గలిగితే ఇండియా కూటమిదే అధి కారం అని పేర్కొన్నారు. అలసత్వం ప్రదర్శించకుండా పోల్ మేనేజ్‌మెం ట్‌పై అందరూ దృష్టి పెట్టాలని, పోలింగ్ బూత్ కేంద్రీకృతంగా పని చేయాలని సూచించారు. పోలింగ్ రోజున పార్టీ సానుభూతిపరుల ఓట్లను ముందుగా వేయించాలని, పోలింగ్ శాతం పెరిగేట్లుగా చూసు కోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన చోట గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలన్నారు. ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలే ఆ బాధ్యత తీసు కోవాలని ఆయన సూచించారు.
లోక్‌సభ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోని పార్టీ నేతలపై కేసీ వేణుగో పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి మంత్రి దామోదర రాజనర్సింహ సహా 15 మంది ఎమ్మెల్యేలు, పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జులు హాజరు కాలేదు. అయితే ఇంత కీలకమైన సమావేశానికి చాలా మంది నేతలు హాజరు కాలేదంటే ఎన్నికల పట్ల వారు ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం అవుతోందంటూ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా జరిగిందంటూ టీపీసీసీ సంస్థా గత కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌ను ప్రశ్నిం చారు. సమావేశం గురించి ఆలస్యం గా సమాచారం అందడంతో అంద రూ పాల్గొనలేకపోయారంటూ మహేష్‌కుమార్‌గౌడ్ వివరణ ఇచ్చారు. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలంటూ కేసీ వేణుగోపాల్ ఆయనకు సూచించారు.
కొంత మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు కూడా ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని పనిచేయ ట్లేదంటూ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోక్‌స భ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారం టూ అసహనం వ్యక్తం చేశారు. ఆయన నియోజకవర్గంలోనే ఉండి పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపై దృష్టి పెట్టాలని సూచిం చారు. అయితే తన సిటింగ్ సీటు భువనగరితో పాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ తదితర నియోజకవర్గాలకూ సమయం కేటాయించాల్సి వస్తు న్నందున సికింద్రాబాద్‌కు ఎక్కువగా సమయం కేటాయించలేక పోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు.
India alliance win in Parliament elections