India sale : దేశాన్ని ఆదానీ, అంబానీలకు అమ్మినా అమ్ముతారు
ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఓటేస్తే దేశాన్ని అమ్మినా అమ్ముతారని, లేదంటే తాకట్టు పెట్టినా పెడతారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మోదీకి ఓటేస్తే అమ్మడం లేదంటే తాకట్టు పెట్టడం చేస్తారు
ఉద్యోగాలు ఉండాలంటే మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు కి జాతీయహోదా ఎందుకివ్వలేదు
కాజీపేట, బయ్యారం ఫ్యాక్టరీలు, ఐటీఐఆర్ ను రద్దేందుకు చేశారు
సమాధానం చెప్పలేకనే బిజెపి దేవుడి ఫొటోతో ఓట్లడుగుతోంది
బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పం దం నూటికి నూరుపాళ్లు నిజం
మల్కాజ్ గిరి ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి(PM Narendra modi) ఓటేస్తే దేశాన్ని అమ్మినా అమ్ముతారని, లేదంటే తాకట్టు పెట్టినా పెడతారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Enumula Revanth Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ప్రధాన రంగాలైన రైల్వేను, ఎన్ఐసీని అదానీ, అంబానీలకు అమ్మేస్తారు కాబట్టి ఆయా సంస్థల్లో పని చేసే వారికి ఉద్యోగాలు ఉండా లంటే మోదీ ఉద్యోగాన్ని ఊడగొ ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని, రిజర్వేషన్లు లేకుండా చేసి దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టాలని బిజెపి(BJP) చూస్తోందని ఆరోపించారు.
దేశంలో రైల్వేలు, ఎల్బీసీ, ఎయి ర్పోర్ట్స్, బీఎస్ఎన్ఎల్, బీహెచ్ఈ ఎల్, బీడీఎల్, ఐడీపీఎల్, డిఫెన్స్ ఫ్యాక్టరీలను తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఉ ద్యోగాలను కల్పించిన ఘనత కాంగ్రె స్ కే (Congress)దక్కుతుందని, ఆ సంస్థలను అందులో ఉద్యోగాలను కాపాడుకో వాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఆదివా రం మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం ప్రసంగించారు.
తెలంగాణకు వస్తున్న నరేంద్రమోదీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తు న్నారో జవాబు చెప్పి రావాలని నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హో దా ఎందుకు ఇవ్వలేదో, ఖాజీ పేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులను(Project) ఎందుకు రద్దు చేశారో ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. తల్లిని చంపి బిడ్డను బతి కించారంటూ తెలంగాణ ఏర్పాటు ను తప్పుబట్టిన మోదీ ఏవిధంగా ఓట్లు అడుగుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీవాళ్ల మాటలు చూస్తే మూదు ఎడ్లు, 36 దొడ్లు అన్నట్లుగా ఉందని విమర్శించారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్ల గొట్టి దేశంలో అధికారంలోకి రావాల ని చూస్తున్నారని, పదేళ్లలో చేసిందే దో చెప్పాలని అన్నారు. రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాల్సిన బాధ్యత తెలంగాణ యువత మీద ఉందన్నారు. 2021లో వరదలు వచ్చినప్పుడు మూసీ పరివాహక ప్రాంతమంతా మునిగిందని, ఆనా డు బీజేపీ అధ్యక్షుడు బండిపోతే బండి అని, గుండు పోతే గుండి స్తానన్నాడని, కానీ, గుండు రాలే, బండి రాలేదని, అరగుండు వచ్చి ఓట్లు అడుగుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) నయా పైసా తీసుకురాలేదన్నారు. మెట్రో ఎందుకు ఇవ్వలేదంటే జైశ్రీరామ్ అంటున్నారని, బయ్యారం ఉక్కు ఎందుకు ఇవ్వలేదంటే హనుమాన్ జయంతి చేశామంటున్నారని తెలి పారు. మన తాతల ముత్తాతల నుంచే శ్రీరామనవమి తదితర పండుగలు చేశామని, ఎల్లమ్మ, పోచమ్మలకు కోళ్లు కోశామని, కల్లు పోశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశా రు. దేవుని ఫోటో చూపి రోడ్ల మీద అడుక్కునే మాదిరిగా బీజేపీవాళ్లు ఓట్లు అడుక్కుంటున్నారని విమ ర్శించారు
పదేళ్లలో ఏం చేశారో చెప్పకుండా కేసీఆర్(KCR) పదేళ్లు సీఎంగా ఉండి ఏమి చేశారో చెప్పుకోకుండా, వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన తమను తిట్టుకుం టూ తిరుగుతున్నారని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. విడివిడిగా వస్తే నెగ్గలేమని అర్థం చేసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ చీకట్లో చేతులు కలిపాయని, అందుకనే మల్కాజ్ గిరి లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తున్నా రంటూ మేడ్చల్ ఎమ్మెల్యే అందరి ముందే చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ పక్కన కూర్చొని మంత్రిగా చేసిన ఈటల రాజేందర్ కూడా రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలకు బాధ్యుడేనని, పంపకాలలో తేడా వచ్చి బయటకొచ్చాడని రేవంత్ విమర్శించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చనందుకే ఆ తర్వాత ఈటల ను అక్కడి ప్రజలు ఓడగొట్టార న్నారు. ఆనాడు కొడంగల్ లో కేసీఆర్ కక్ష గట్టి తనను ఓడిస్తే మల్కాజ్ గిరి నుంచి ప్రశ్నించే గొంతుకగా ఎంపీగా గెలిపించారని, తాను సీఎం కావడానికి నాడు మల్కాజ్ గిరి ప్రజలిచ్చిన ప్రోత్స హమే కారణమని రేవంత్ తెలి పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చంద్రాయణ గుట్ట, పీ7 రోడ్డు ద్వా రా ఎయిర్పోర్టుకు మెట్రో రైలు ను విస్తరించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
కౌలురైతుకూ భరోసా..
కౌలు రైతుతోపాటు ఆ భూమి యజమానికీ రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేర్వేరుగా ఇస్తామని చెప్పా రు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఎగ్గొ ట్టేది లేదని స్పష్టం చేశారు. గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తిస్తామని, ఆయా గ్రామాల్లో కౌలు రైతుల జాబితాలను పంచాయతీ ల్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరిస్తా మని తెలిపారు.
ఈ ప్రక్రియనంతా పారదర్శకంగా చేస్తామని, ఇందుకు సంబంధించిన విధివిధానాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పెడ తానని అన్నారు. ఆదివారం ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రంలో 92 శాతం మంది రైతులు 3 ఎకరాల లోపు భూమి ఉన్నవారేనని సీఎం చెప్పా రు. ఐదెకరాల పైబడి భూమి ఉన్న ది 4 లక్షల కుటుంబాలకేనన్నారు. నాలుగేళ్లపాటు అందరూ కలిసి కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్ చేసిన కష్టానికి వంద తరాలకు సరిపోయేంత కూలి ఆయనకు గిట్టుబాటైందని రేవంత్ వ్యాఖ్యానించారు.
తెలంగాణకు జాతిపిత కేసీఆర్ కాదని, ప్రొఫెసర్ జయశంకర్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పండ రోజులు కూడా కాకముందే కూలగొడతామని బయలు దేరారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి కొంద రు వచ్చి తమతో కలిసి నడుస్తామ ని చెప్పారని వెల్లడించారు. అయితే క్లీన్ ఇమేజ్ ఉన్నవారిని, పద్ధతి గల వారినే కాంగ్రెసలోకి తీసుకుంటున్నా మని చెప్పారు. సమయం, సంద ర్భం వచ్చినప్పుడు ఎలా వ్యవహ రించాలన్నదానిపై తనకు స్పష్టత ఉందన్నారు.
తాము రాష్ట్ర ఆదా యాన్ని పెంచి ప్రజలకు పంచుతా మని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబ డులు తెస్తే ఆదాయం, ఉపాధి పెరుగుతాయన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిషన్ వేస్తామని చెప్పారు. ఇక సచి వాలయం వద్ద ఉన్న అంబేడ్కర్(Ambedkar)విగ్రహానికి దండ వేయకపోవడంపై సీఎం స్పందిస్తూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఏది చేసి నా సీఎస్, డీజీపీలే చేయాలని అన్నారు. శ్రీరామనవమి రోజు భద్రాచలంలో పట్టువస్త్రాలు కూడా సీఎస్ సమర్పించారని గుర్తు చేశా రు.
India sold Adani and Ambani