*కోదాడ లో ఘనంగా 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణానికి భూమిపూజ.
*100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు తో కోదాడ కు జాతీయ స్థాయిలో గుర్తింపు..
ప్రజా దీవెన, కోదాడ: యువత లో జాతీయ భావం పెంచేందుకు ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ (Indian Veteran Organization)చేస్తున్న కృషి అభినందనీయం అని పలువురు ప్రముఖులు అన్నారు.బుధవారం కోదాడ పట్టణం లోని వాయల సింగారం రోడ్ లో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ (Indian Veteran Organization)కోదాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణానికి మాజీ సైనిక అధికారి ఐవివో స్టేట్ కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షులు గుండా. మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన భూమి పూజ లో వారు ముఖ్య అతిధులు గా పాల్గొని మాట్లాడారు. నాడు దేశ రక్షణ కోసం (For the defense of the country)సైన్యం లో ఉండి దేశాన్ని కాపాడిన సైనికులు నేడు ఉద్యోగ విరమణ చేసి ఐవివో ద్వారా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడం ప్రశంసనీయం అన్నారు. ప్రధానంగా యువత లో జాతీయ భావం కొరవడుతుందని ఇటువంటి బృహత్తర కార్యక్రమాలతో యువత లో కదలిక వస్తుందన్నారు.100 అడుగుల జాతీయ జెండా (100 feet national flag) నిర్మాణం తో కోదాడ పట్టణం దేశం లో ప్రత్యేక గుర్తింపు పొడుతుందన్నారు. సమాజహిత కార్యక్రమాలు చేస్తున్న ఐవివో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మధుసూదన రావు కు అందరు సహకారం అందించాలన్నారు.
ఈ ఆర్గనైజేషన్ లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. భూమి పూజ కు హాజరైన మాజీ సైనికులతో పాటు పలువురు ప్రముఖులకు ఐవివో ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.అనంతరం కార్గిల్ యుద్ద వీరుడు (Kargil war hero)గోపయ్య జయంతి సందర్భంగా కోదాడ లోని గోపయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఐ వి ఓ రాష్ట్ర అధ్యక్షులు ఉజ్జిని. రవీందర్ రావు, కేరళ స్టేట్ అధ్యక్షులు దివాకర్, సౌత్ జోన్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల.లక్ష్మీనారాయణ రెడ్డి,పట్టణ సీఐ రాము, ఫ్యాట్రాన్స్, జగని.ప్రసాద్, గుండపనేని నాగేశ్వరరావు,వీరనారి శారద, పిఆర్వో షేకు.రమేష్, లక్ష్మీ,కళ్యాణి, వెంపటి. ప్రసాద్, స్థల దాత కత్తి. భగత్, నాగు బండి. రంగా పైడిమర్రి వెంకటనారాయణ,పుర ప్రముఖులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.