విలువలతో కూడిన జర్నలిజం అవసరం
—ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్
Indianjournalists: ప్రజా దీవెన, రంగారెడ్డి:తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్ట్ మరియు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ద్వి తీయ మహాసభ ప్రగతి రిసార్ట్ లో మంగళవా రం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఐజెయు మాజీ జాతీయ అ ధ్యక్షుడు దేవులపల్లి అమర్, తెలంగాణ స్టేట్ యూనియ న్ ఆఫ్ వర్కిం గ్ జర్నలిస్ట్ అధ్య క్షుడు విరాహత్ అలీ భారత రాష్ట్ర సమితి జాతీయ స్పోక్స్ పర్సన్ కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ఈ సంద ర్భంగా ఐజెయు మాజీ అధ్య క్షుడు దేవు లపల్లి అమర్ మాట్లాడుతూ విలు వల తో కూడిన జర్నలిజం అవ సరం ఉన్నదని ఆయన అన్నారు.
జర్నలిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవ హరిస్తున్న తీరు ఆక్షేపనీ యంగా ఉన్నదని ఆయ న అన్నారు, జర్న లిస్టుల పట్ల కేంద్ర ప్రభు త్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన దుయ్యబట్టా రు.దేశంలోనే అధిక ఆదాయాన్ని దేశానికి ఇస్తున్న జిల్లాగా రంగారెడ్డి ప్రథమ స్థా నంలో నిలుస్తుందన్నారు.స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి తో ఉన్న అను బంధాన్ని గుర్తు చేసుకున్నారు.జర్నలిస్టుల సమస్యలపై దశాబ్దాల కాలంగా యూనియన్ చేస్తున్న కృషిని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అగ్ర జర్నలిస్టులు తమ యూని యన్ వారే అన్నారు.నాడు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ లో సంఘం నుం డి వ్యతిరేకత వచ్చిన ముందుకెళ్లినట్లు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వా ల్లో మన యూనియన్ నుండి ప్రాతినిధ్యం వహించిన పాత్రికేయుల సంక్షేమాన్ని ఎన్నడూ విస్మరించలేదన్నారు.
జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవలికాలంలో జర్నలిజాం లో చోటు చేసుకున్న సంఘటనలు బాధాకరమని అన్నా రు.జర్నలిస్టులు ప్రజల గొంతుకలుగా పనిచేయాలన్నారు.గత ప్రభు త్వం తమ సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర స్టేట్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు విరాహత్ అలీ మాట్లాడుతూ పుట్టగొడుగుల్ల అనేకమంది జర్నలిస్టులమని చెప్పుకొని తిరుగుతూ వ్యవస్థ ను పలుచన పడేస్తు న్నారని ఆయన అన్నారు, ఇట్లాంటి వాటిపై జర్నలిస్టులు దృష్టి కేంద్రీ కరించ వలసిన అవసరం ఉన్నదని ఆయన పిలుపు నిచ్చారు,
భారత రాష్ట్ర సమితి స్పోక్స్ పర్సన్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ జర్నలి స్టులకు అండగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు, రాబోయే రోజుల్లో అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సంక్షేమం పై ప్రత్యేక దృష్టి తో ఆలోచన చేసేందుకు బాధ్యత తీసుకొని మీకు అండగా నిలబడ తానని ఆయన జర్నలిస్టులకు భరోసా కల్పించారు, జిల్లాలోని జర్నలి స్టులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా రక్షణకు అవ సర పడిన ప్రీమియమును అందజేసిన భారత రాష్ట్ర సమితి జాతీయ స్పోక్స్ పర్సన్ కార్తీక్ రెడ్డికి జిల్లా కార్యవర్గము కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్య క్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ,కార్యదర్శులు శ్రీకాంత్ రెడ్డి,మధు గౌడ్,కోశాధికారి వెంకట్ రెడ్డి,రాష్ట్ర ముఫిసిల్ కమిటీ చైర్మన్ పేపర్ శ్రీనివాస్,చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబా,రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు,ఎన్నికల అధికారి బాలరాజు గౌడ్,జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులుగా ఎం డి సలీమ్ పాషా,కార్యదర్శిగా సత్యనారాయణలు ఎన్నికయ్యారు.