Indira Park : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బడ్జెట్కు నిరసనగా తెలంగాణకు జరిగిన అ న్యాయాన్ని నిరసిస్తూ 10వ తేదీన ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నా, సభను జయప్రదం చేయవలసింది గా అఖిల భారత ప్రజాతంత్ర మహి ళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి కోరారు. శుక్రవారం ఐ ద్వా నల్గొండ జిల్లా కమిటీ సమావే శం పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్ష తన స్థానిక దొడ్డి కొమురయ్య భవనంలో జరిగింది ఈ సందర్భం గా ప్రభావతి మాట్లాడుతూ మహి ళలకు బడ్జెట్లో సరి ఒక వాటా దక్క లేదని అన్నారు విద్యా వైద్యం ఉపా ధి మహిళా సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాల్సిందిగా డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు దోచిపెడుతుం దని పేద మధ్యతరగతి వర్గాల పైన పన్నుల భారం అధికంగా వేసిందని అన్నారు .
తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిం దని తెలిపారు ఇప్పటికైనా బడ్జెట్ సవరించి తెలంగాణకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు ప్రతిపక్ష రాష్ట్రాల పైన సవతి తల్లి ప్రేమ చూపించడం కరెక్ట్ కాదని తెలియ జేశారు రేపు ఇందిరాపార్క్ వద్ద 10వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టినట్లు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరా వాలని పిలుపునిచ్చారు ఈ కార్య క్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యు రాలు కొండ అనురాధ జిట్టా సరోజ జిల్లా ఆఫీసు బేరర్స్ భూతం అరుణకుమారి పాదూరి గోవర్ధన కారంపూడి ధనలక్ష్మి ఎస్కే సుల్తా నా దామెర లక్ష్మీ జిల్లా కమిటీ సభ్యులు కనుకుంట్ల ఉమారాణి జంజరాల ఉమా నాగమణి అరుణ తదితరులు పాల్గొన్నారు.