Kodanda ram: మోదీ పాలనలో పెరిగిన అసమానతలు
పదేళ్ల మోడీ పాలనలో దేశంలో అసమా నతలు పెరిగిపోయాయని తెలంగా ణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు.
తెలంగాణ జన సమితి అధ్య క్షుడు ప్రొఫెసర్ కోదండరాం
ప్రజా దీవెన బర్కత్‌పుర: పదేళ్ల మోడీ పాలనలో(Modi rule) దేశంలో అసమా నతలు పెరిగిపోయాయని తెలంగా ణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. దేశ సం పద కొద్దిమంది చేతిలో కేంద్రీకృత మై ఉందని ధ్వజమెత్తారు. తెలం గాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికల(Parliament elections) సందర్భంగా ఓటర్లను చైతన్యవంతుల్ని చేేసందుకు మోదీ పదేళ్ల పాలనలో వైఫల్యాలను వివ రిస్తూ ముద్రించిన వాల్‌పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాన్ని గన్ పార్క్ వద్ద నిర్వ హించాల్సి ఉండగా అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో దానిని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌కు మా ర్చారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ దేశంలోని 162 మం ది బిలియనీర్ల వద్ద 40 శాతం సంప ద, 20 శాతం ఆదాయము కేంద్రీకృ తమై ఉందని పేర్కొన్నారు. దేశంలో ని 70 కోట్ల మంది ప్రజల వద్ద కేవ లం 15శాతం సంపద ఉందని, ఈ వ్యత్యాసం దేశానికి అత్యంత ప్రమా దకరమని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికల బాండ్లు(Elections bonds) అవినీతికి తెర లే పాయని విమర్శించారు. ఈ సంద ర్భంగా జేఏసీ నిర్వహించే ప్రచార ఉద్యమాలను ప్రజాస్వామికవా దులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లాడుతూ భార త ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, విలువలు నేడు ప్రమాదంలో పడ్డా యని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, లేకుంటే ప్రజాస్వామ్యం(Democracy) నియంతృత్వంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. రాజ్యాంగం మా రితే మానవ విలువలు విధ్వంసం అవుతాయని, పౌర సమాజం మాట్లాడే హక్కులు కోల్పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రచార ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రమా మెల్కోటే, ప్రొఫెసర్ ఎం.ప్రారంభ, జేఏసీ కో కన్వీనర్ కన్నెగంటి రవి పాల్గొన్నారు
Inequality in India in Modi rule