Inhumanattack: ప్రజా దీవెన, హైదరాబాద్: మానవత్వం మంటగలిసి వేళ ఓ మాన వ మృగం ప్రవర్తించిన అమానవీయ తీ రు వళ్ళుగగుర్పొడుస్తుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆదివారం రాత్రి అమానవీయ ఘటన అందరిని భయకంపుతులను చేసింది. కడుపుతో ఉన్నదని కూడా చూడ కుండా భార్యను నడిరోడ్డుపై పడేసి సిమెంట్ ఇటుకతో విచ క్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్రం గా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య దవాఖానలో చికిత్స పొందుతున్నది. గచ్చి బౌలి ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.
వికారాబాద్‌కు చెందిన ఎండి. బస్రత్ (32) హఫీజ్ పేట్‌లోని ఆది త్యనగర్‌లో ఉంటూ ఇంటీరియర్ పనులు చేస్తుంటాడు. 2023 జన వరిలో అజ్మీర్ దర్గాకు వెళ్తుండగా బస్సులో పశ్చిమ బెంగాల్‌కు చెంది న షబానా పర్వీన్ (22) పరిచయ మైంది. అది కాస్త ప్రేమగా మారడం తో 2024 అక్టోబర్‌లో కోల్‌కతాకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అనంతరు ఆమెను హఫీజ్‌పేటకు తీసుకొచ్చాడు. పర్వీన్ ఒత్తిడితో అదే బస్తీలో వేరుకాపురం పెట్టాడు. అప్పటి నుంచి ఇద్దరిమధ్య గొడవ లు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో పర్వీన్ ఇటీవల గర్భం దాల్చింది. మార్చి 29న వాంతు లు కావడంతో దవాఖానలో చేర్పించా డు. రెండు రోజుల చికిత్స అనంత రం ఈనెల 1న రాత్రి 10 గంటల స మయంలో భార్యను డిశ్చార్జ్ చేసు కుని హాస్పిటల్ నుంచి బటయకు తీసుకొచ్చా డు. ఈ క్రమంలో మళ్లీ వారు గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో ఒక్క సారిగా షబానాపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను కాలి తో తన్నాడు. దీంతో కిందపడిన ఆ మె తలపై అక్కడే ఉన్న ఓ సిమెంట్ ఇటుకతో కొట్టాడు. తీవ్రంగా గాయ పడిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
దీంతో చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపో యా డు. స్థానికుల సమాచారంతో ఘట నా స్థలానికి చేరుకున్న పో లీసులు షబానాను చికిత్స నిమిత్తం ఉస్మా నియా దవాఖానకు తర లించారు. తలకు బలమైన గాయం కావడం తో కోమాలోకి వెళ్లిన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలి పారు. కేసు నమో దు చేసి నిందితుడు బస్రత్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.