ఆసుపత్రిలో అమానుషం
— యువతిపై లిఫ్ట్ ఆపరేటర్ అత్యాచారం
ప్రజా దీవెన/ హైదరాబాద్: వారు వీరు అనే బేధం లేకుండా పసిపాప నుంచి పండు ముదసలి వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. పగలు రాత్రి అనే తేడాలేకుండా అడవారిపై అమానుషంగా వ్యవహరిస్తున్నారు కామాంధులు.
సరిగ్గా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ సనత్ నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో జరిగింది. పక్కా ప్రణాళికతో ఓ బాలికను ఆసుపత్రి లిఫ్ట్‌లో భవనం పై అంతస్తుకు తీసుకెళ్లాడు.
ఆ తర్వాత సదరు లిఫ్ట్ ఆపరేటర్ యువతి నోటికి గుడ్డ అడ్డం పెట్టి అత్యాచారానికి ఒడిగట్టాడు. డైట్ సెక్షన్‌లోని ఫ్లోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.