District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నార్కట్ పల్లి: నకిలీ తాళం చెవిలు ఉపయోగిస్తూ మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలని అరెస్టు చేసిన నార్కట్ పల్లి పోలీసులు ,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్న నార్కట్ పల్లి పోలీసులు
ఏడు కేసులకు సంబంధించి సుమారుగా 16 లక్షల విలువ గల 12 మోటర్ సైకిళ్ల కు దొంగల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన నిందితులు మట్టిపల్లి శ్రీకాంత్, మట్టి పల్లి వెంకన్న, మట్టి పల్లి అనిల్ ను అరెస్ట్ చేసి నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు, నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో నా పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో కేసును చేదించిన నార్కెట్పల్లి ఎస్సై క్రాంతి కుమార్ మరియు సిబ్బందిని అభినందించి రివార్డు ఇచ్చిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..