Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Inter exams : ఇంటర్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు

–నేటి నుండి ప్రారంభం కానున్న పరీక్షలు

–52 పరీక్షా కేంద్రాలు.. 28722 మంది విద్యార్థులు

–ఈనెల 20 వరకు కొనసాగనున్న పరీక్షలు

–అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించిన డిఐఈఓ

Inter exams : ప్రజాదీవెన, నల్లగొండ బ్యూరో : జిల్లాలో ఇంట ర్మీడియట్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి నుండి ఈనెల 20 వరకు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగను న్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముంద స్తుగా సిలబస్ పూర్తి చేశారు.

ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెల్లవారుజామునే చదివించా రు. మరో వైపు పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల సమస్య పీడిస్తోంది. జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశలను ఇప్పటికే నిర్వహించారు కానీ.. సమస్యలు అధిగమిస్తేనే విద్యార్థు లకు కష్టాలు తీరనున్నాయి.

28722 మంది విద్యార్థులు… జిల్లాలో 13 ప్రభుత్వ, 51 ప్రైవేటు, గురుకులాలు, మోడల్ స్కూల్, కస్తూరిబాలు 72 కలుపుకొని మొ త్తం 136 కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం 28722 మంది విద్యార్థులకు 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మొ దటి సంవత్సరం సాధారణ విద్యార్థులు 11706, వృత్తిపర 2341, మొత్తం విద్యార్థులు 13992 పరీక్షలు రానున్నారు. ద్వితీయ సంవ త్సరం విషయానికొస్తే సాధారణ విద్యార్థులు 12389, వృత్తిపర 23 41, మొత్తం 14730 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

కాగా విద్యార్థులు చరవాణి నుంచి హాల్ టికెట్ డౌన్లోడు చేసుకునే విధానం ఉండటంతో ప్రైవేటు కళాశాల యాజమాన్యాల ఫీజుల వేధింపులు తప్పాయి. ఇప్పటి వరకు సీసీ కెమెరాల పర్యవే క్షణలో ప్రశ్నపత్రాలు తెరవడం, మూసేయడం ఉండేది. ప్రస్తుతం ప్రతి కళా శాలకు ప్రశ్నపత్రాల గది, హాల్, బయట మరో మూడు మొత్తం అ యిదు కెమెరాలు బిగించారు. వీటికి రాష్ట్ర స్థాయిలో అనుసంధా నించారు.

హై పవర్ కమిటీ…ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, ఆధ్యాపకునితో హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డిఐఈఓ తో కలిపి జిల్లా ఎగ్జామినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలే కాకుం డా ఇద్దరూ ఫ్లయింగ్ స్క్వాడ్ లను, 1436 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు.

దారి చూపనున్న క్యూఆర్ కోడ్…విద్యార్థులకు పరీక్ష కేంద్రాల సమా చారం లేకపోవడంతో హైరానా పడుతున్నారు. ఒకే పేరిట కళాశాల లకు సంబంధించి బ్రాంచ్ లు ఉండటంతో చిరునామా తెలియకపో వడంతో సకాలంలో చేరుకోక పరీక్ష రాయ లేకపోతున్నారు. ఇలాంటి ఇబ్బందులను గుర్తించి ఈసారి హాల్ టికెట్ ల పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. చరవాణిలో స్కాన్ చేయడంతో పరీక్ష కేంద్రం చిరునా మా ఆధారంగా సులువుగా తెలుసుకోవచ్చు. విద్యార్థులు తీవ్ర ఒత్తి డి, ఆందోళనకు గురైతే టెలీమానస్ టోల్ ఫ్రీ నంబర్ 14416 లేదా 18008914416ను సంప్రదిస్తే ధైర్యాన్ని అందించే విధంగా ఏర్పా ట్లు చేశారు.

సమస్యలు అధిగమిస్తే మేలు…

–పరీక్ష కేంద్రాల్లో గాలి, వెలుతురు, విద్యుత్తు సర పరా, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, ఇతర వసతులు కొరవడుతున్నాయి.

–దూర ప్రాంతాల విద్యార్థులు ఆర్టీసీ బస్సులు నడిపించకపోడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కేంద్రాల్లో        సరిపడా డ్యుయెల్ బెంచీలు లేవు.

–ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో చేతి పంపులు, బోర్ల నీరే దిక్కవుతోంది.

కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాం…దస్రు నాయక్ , జిల్లా ఇంటర్మీడి యట్ అధికారి…జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష కోసం పటిష్ఠ ఏర్పా ట్లు చేశాం. పరీక్ష కేంద్రాల్లో కావలసిన మౌలిక వసతులు అన్ని కల్పిం చాం. లైటింగ్, ఫ్యాన్లు, త్రాగునీరు, ఏఎన్ఎం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, డ్యూయల్ డెస్క్ బెంచీలను ఏర్పాటు చేశాం. పరీక్షల సమయంలో ఆర్టీసీ బస్సులు నడిపించనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉం టుంది. ఎలాంటి మాస్ కాపీయింగ్ లేకుండా నిఘా పెంచాం.