చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘము
INTUC : ప్రజా దీవెన, నారాయణపురం : చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం వారు వారి సమస్యల పరిష్కారానికై మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సోమవారం కలిశారు.చౌటుప్పల్ పట్టణంలో హైవే విస్తరణలో భాగంగా రోడ్డుకి ఇరుపక్కల ఉన్నటువంటి చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను కోల్పోతున్న విషయాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి తెలియజేయడమైనది వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవలసిందిగా కోరారు. ఈ నేపథ్యంలో శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ చిరు వ్యాపారులకు అండగా ఉంటానని వారికి ఒక శాశ్వతమైన స్థలాలను కేటాయించి వారి సమస్యను వెంటనే పరిష్కరించవలసిందిగా చౌటుప్పల్ RDO గారికి ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే గారిని సన్మానించారు.ఇట్టి కార్యక్రమంలో INTUC మండల అధ్యక్షులు చామాట్ల శ్రీనివాస్,INTUC మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల గణేష్ కుమార్,INTUC చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి MD చాంద్ పాషా,చౌటుప్పల్ మండల మైనారిటీ నాయకులు మొహమ్మద్ ఆరిఫ్,చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు బోదుల యాదగిరి,ప్రధాన కార్యదర్శి వలిగొండ బిక్షం, అలిసెరు బాలరాజు,విజయ్ కుమార్,గుండ్ల రామ్ చంద్రయ్య ,N. శ్రీను,బోగ రాజేష్,V. శోభన్, ముత్యాల రాములమ్మ,నిమ్మల శంకరమ్మ,తదితరులు పాల్గొన్నారు