ITI: ప్రజాదీవెన, హైదరాబాద్: 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో (ITI) ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ జూన్ 19 నుంచి ప్రభుత్వ పాత ఐటీఐలో (ITI) జరగనున్నట్లు కంచరపాలెం ప్రిన్సిపల్ జె శ్రీకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఇటీవల ఆన్‌లైన్‌లో (online) దరఖాస్తులు కూడా స్వీకరించింది. మొత్తం 3398 మంది అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల్ని పరిశీలించారు. వీరంతా ర్యాంక్‌ల వారీగా కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఆయన తెలిపారు. కౌన్సెలింగ్ సమయంలో అన్ని ఒరిజనల్ పత్రాల్నీ తమ వెంట తీసుకురావాలని ఆయన అన్నారు. జూన్ 26 వరకు కౌన్సెలింగ్ (Counselling) ఉంటుంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.