Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ITI: అత్యాధునిక సాంకేతికతో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు

–ఐటీఐ, ఏటీసీలను అధునీకరిం చేందుకు శ్రీకారం
–శిక్షణ కేంద్రాలన్నీ రూ.2,324 కోట్ల తో ఆధునికరిస్తాo
–టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో పదేళ్ల కాలానికి ఒప్పందం
— ఐటీఐల్లో కొనసాగుతోన్న పాత కాలం నైపుణ్యాలు నిస్ఫలం
–మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన
–ఏటా ఆరు దీర్ఘకాలిక కోర్సుల్లో 15,860 మందికి అవకాశం
–శిక్షణ పూర్తయిన వెంటనే అనంత రం టీటీఎల్‌లో ఉద్యోగావకాశాలు
–లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోనాటిక్స్‌ ఇండియా డైరెక్టర్‌తో సీఎం రేవంత్

ITI: ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ (Telangana)లోని ప్రభుత్వ పారి శ్రామిక శిక్షణ కేంద్రాలు (ఐటీఐ) నిరుప యోగంగా మారాయని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పాతకాలం యాభై ఏళ్ల నాటి నైపుణ్యాలనే ఇప్పటికీ నేర్పిస్తున్నారని, వాటితో విద్యార్థుల కు ఉపయోగం లేకుండా పోయిం దని ఆయన వ్యాఖ్యానించారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యువతను తీర్చిది ద్దేం దుకు ఐటీఐలను (ITI) ‘అధునాతన సాం కేతిక కేంద్రాలు’ (ఏటీసీ)గా మార్చేం దుకు ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. రూ.2324 కోట్లు వెచ్చించి టాటా సంస్థసహకారంతో రాష్ట్రం లోని 65 ఐటీఐలను ఏటీసీ లుగా మార్చుతున్నట్లు సీఎం ప్రక టించారు. ఐటీఐలను ఏటీసీలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు టాటా టెక్నా లజీస్‌ లిమిటెడ్‌ (టీటీఎల్‌)తో పదే ళ్ల కాలానికి గాను ప్రభుత్వం అవగా హన ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.

హైదరాబాద్‌లోని మల్లే పల్లి ఐటీఐలో ఏటీసీలకు రేవంత్‌ (Revanth) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడారు. కేవలం విద్యార్హత తాలూకు ధ్రువీకరణ పత్రాలు చేతిలో ఉంటే సరిపోదని, సాంకేతిక నైపుణ్యమూ ఉండాలని చెప్పారు. తాను సొంతిల్లు నిర్మించు కున్న సమయంలో రూ.15వేలకే ఇంజనీర్లు అందుబాటులో ఉండే వారని, అనుభవం ఉన్నవారు మాత్రం రూ.50వేల దాకా తీసుకు నేవారని గుర్తు చేశారు. తెలంగాణ (Telangana) ఉద్యమంలో నిరుద్యోగ సమస్య కీలక పాత్ర పోషించిందని, నిరు ద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్య మని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులను కుటుంబసభ్యు లుగానే తాను భావిస్తానని, ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ఏటీసీల ఏర్పాటు అని పేర్కొన్నారు.

రాష్ట్రం లో 40 లక్షల మంది యువతీ యు వకులు ఉపాధి లేక నియామక బోర్డుల చుట్టూ తిరుగుతున్నారని, గత పదేళ్లలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఎందరో ఆత్మహత్య లకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ (IT)రంగంలో మన తెలు గు వారు ప్రపంచదేశాలతో పోటీ పడుతున్నారని, మధ్య, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి, వారికి ఉపాధి కల్పించడమే తమ బాధ్యత అని చెప్పారు. ఏటీసీల ద్వారా నైపుణ్యాలను నేర్పించి, నిరుద్యో గుల్లో భరోసా కల్పిస్తామని చెప్పా రు. విద్యార్థులు ఏటీసీల్లో చేరాలని సూచించారు. దీనికి సంబంధించిన శాఖ తన దగ్గరే ఉంటుందని, తానే ఏటీసీలను ప్రతి నెలా పర్యవేక్షి స్తానని చెప్పారు. విద్యార్థుల శిక్షణ కోసం ముందుకొచ్చిన టాటా (TATA) యాజ మాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.