Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ITministersridharBabu తెలంగాణ యువతను నైపుణ్య మానవవనరులుగా తీర్చిదిద్దుతాo

 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

 ITministersridharBabu:  ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో పరిశ్రమల అవసరాలకు అను గుణంగా తెలంగాణ యు వతను అన్ని రంగాల్లో అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులుగా తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం గచ్చిబౌలి లోని ఇంజినీరింగ్ స్టాఫ్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎ స్ఐసీ)లో ఏ ర్పాటు చేసిన యంగ్ ఇం డియా స్కిల్స్ యూనివర్శిటీ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. అ నంతరం యూనివర్సిటీ అ ధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చి దిశా నిర్దేశం చేశారు.

అత్యుత్తమ నైపుణ్య మానవ వన రులకు చిరునామాగా తెలంగాణ ను మార్చాలనే సంకల్పంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివ ర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ యువతలో ప్రతిభకు కొదవ లేదని, మార్కెట్ అవసరా లకు అనుగుణంగా స్కిల్ డెవల ప్మెంట్ లో శిక్షణ అందిస్తే మరింత మెరుగ్గా తయారవుతారన్నారు.

పరిశ్రమలతో నిరంతరం సంప్రదిం పులు జరుపుతూ కోర్సుల రూప కల్పనలో పరిశ్రమలను భాగస్వా మ్యం చేయాలని సూచించారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సుల పై ప్రధానంగా దృష్టి సారించాల న్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు సాఫ్ట్ స్కిల్స్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించా రు. కోర్సు పూర్తయ్యే నాటికి అభ్య ర్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు.

రాష్ట్రంలోని ప్రముఖ విద్యా, పరి శోధన, టాస్క్, డిజిటల్ ఎంప్లాయి మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) తదితర సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఆదే శించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, స్కిల్ యూని వర్సిటీ వీసీ సుబ్బారావు, ఓఎస్డీ చమాన్ మెహతా తదితరులు పాల్గొన్నారు.