J. Srinivas : ప్రజా దీవెన, నల్లగొండ: వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పార దర్శకంగా నిర్వహించాలని న ల్గొం డ జిల్లా అదనపు కలెక్టర్ మరియు వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెం ట్ రిటర్నింగ్ అధికారి జె. శ్రీనివాస్ కోరారు. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయావరణలోని ఉదయాదీత్య భవన్లో వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియ మించబడిన పిఓ,ఏపిఓ, సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅ తిథిగా హాజరై పలు సూచనలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం జారీ చేసిన పిఓ హ్యాండ్ బుక్ ను బాగా చదవాలని చెప్పారు. పిఓ, ఏపీవో, మైక్రో అబ్జర్వర్లు వారికి కేటాయించిన విధుల ప్రకారం పోలింగ్ నిర్వహించాలన్నారు.పీవో పోలింగ్ కేంద్రంలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రదర్శింప చేయడం, అభ్యర్థుల ఏజెంట్ల జాబితా పరిశీలన, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం వంటి అన్ని అంశాల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంతేకాక బ్యాలెట్ బాక్సులు ముందే తనిఖీ చేసుకోవాలని , పోలింగ్ కు ముందే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లు తెరిచి చూపించాలని, అప్పుడే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహి స్తున్నట్లు వారికి తెలుస్తుందని అన్నారు.
డిక్లరేషన్ అలాగే పోల్ ప్రారంభం వంటి వాటి పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలో శాంతిభద్రతలు, అలాగే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడే వారి వివరాలు అన్నింటి పట్ల పి ఓ ఏ పి ఓ లుఅవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు ఓటు వేయవలసి ఉంటుందని, ఇందుకు ఎన్నికల కమిషన్ అంగీకరించిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్ మాత్రమే వాడాలని ఈ విషయం ముందే ఓటర్లకు తెలియజేయాలని చెప్పారు.ఎన్నికలలో ఫారం -16 అత్యంత కీలకమని అన్నారు. బ్యాలెట్ పేపర్ కు సంబంధించి ఎలాంటి పొరపాట్లు లేకుండా తీసుకున్న బ్యాలెట్లు, ఓటింగ్ తర్వాత అప్పజెప్పే బ్యాలేట్ పేపర్ల విషయంలో తేడాలు లేకుండా చూసుకోవాలని, వినియోగించిన బ్యాలెట్లను సైతం సీరియల్ నంబర్ తో సహా వేసుకొని సమర్పించాల న్నారు.
ఎన్నికలలో పిఓ డైరీ అత్యంత కీలకమని ఆయన తెలిపారు .అలాగే స్టా ట్యూరీ నాన్ స్టాచ్యుటరీ కవర్లు వీటన్నిటి పట్ల అవగాహన కలిగి ఉండాలని, మరోసారి ఎన్నికలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు .ఎట్టి పరిస్థితులలో ఎన్నికల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించవద్దని పూర్తి జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాల్సిందిగా ఆయన కోరారు.ఆర్డిఓ నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డ, ఎల్డిఎం శ్రామిక్, ఎన్ని కల శిక్షకులు కొండమల్లేపల్లి ఎంపీ డీవో బాలరాజు రెడ్డి, తదితరులు ఉన్నారు.