–పక్షం రోజుల్లో భవిష్యత్తు కార్యాచ రణ
–9 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క హామీ అమలు కాలేదు
–పీఆర్సీ, డీఏపై కంటికి కానరాని స్పందన
–ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగుల ఆగ్రహం
–53 ఉద్యోగ సంఘాల ఆద్వర్యం లో జేఏసీగా ఏర్పాటు
JAC of Telangana Employees: ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (JAC of Telangana Employees) ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 రోజుల్లో మా భవిష్యత్ కార్యాచరణ ప్రక టిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తేల్చిచెప్పింది. సోమవారం హైదరాబాద్ లో అన్ని ఉద్యోగ సం ఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పడింది. ఈ సమావేశానికి 53 ఉద్యోగ సం ఘాలు హాజరయ్యాయి. ఈ సం దర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏ సీ ప్రతినిధులు మీడియాతో మాట్లా డారు.రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పా టు చేసుకోవడం జరిగిందని తెలి పారు. తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా జేఏసీ ఏర్పాటు చేయ డం జరిగిందో ఇప్పుడు మళ్లీ అదే విధoగా జేఏసీ ఏర్పాటు చేసుకోవ డం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా పీఆ ర్సీ, డీఏ ఇస్తామని ఎన్ని కల మేని ఫెస్టోలో పెట్టారు కాని ఉద్యోగ సంఘాలతో సమావేశం అవు తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు చెప్పి ఇప్పుడు తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, సీఎం సిద్ధంగా లేనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భాగ్యన గర్ సొసైటీ, ఇతర సొసైటీ (Bhagyana Gar Society, Other Society)భూము లను మాకు అప్పగించాలని కోరు తున్నాము. 15రోజుల్లో మా భవి ష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్ని జిల్లాలో తిరిగి అందరిని కలు పుకొని ముందుకు పోతామని, మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ఎన్నికల మేని ఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని మాత్రమే మేం కోరుతు న్నామని పేర్కొన్నారు.ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నారు, కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో జీతాలు ఒకటో తేదీన రావడం లేదని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని మా న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. సమస్యలు పరిష్కారం చేయకుంటే మా కార్యాచరణ ప్రకటిస్తామని, మా సమస్యలపై అందరిని కలు స్తామని, గురుకుల పాఠశాలలో సమ స్యలు వెంటనే పరిష్కారిం చాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి ఈ జేఏసీ (jac) పని చేస్తోంది అని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ వెంటనే అమలు చేయాలని, ఈ విషయాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టిందని, హెల్త్ స్కీం వెంటనే అమలు చేయాలని, గత ప్రభుత్వంమాకుకంట్రిబ్యూషన్ కింద హెల్త్ స్కీం (Health Scheme) చేస్తాం అని విఫలం అయ్యారని ఆరోపించారు.