— ప్రైవేటీకరణకు ముమ్మరంగా ప్రయత్నాలు
–కుట్రల్లో భాగoగానే పాతబస్తీ లో అదానీకి అప్పగింత
–బీఆర్‌ఎస్ మాజీమంత్రి, సూర్యా పేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి
Jagadeesh Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా టైన తర్వాత విద్యుత్ సంస్థల్లో విప రీత ధోరణి కొనసాగుతోందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జి జగదీష్ రెడ్డి (jagadeesh reddy)ఆరోపించారు. రాష్ట్రం లో విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు పెద్ద కుట్ర జరుగుతోందని దుయ్యబ ట్టారు. ప్రైవేటు గూండాలకు బిల్లుల ను వసూలు చేసే బాధ్యతలను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణభవన్ (Telangana bhavan)లో పార్టీ నేతలు బడుగుల, క్యామ మల్లేష్‌లతో కలిసి ఆయన విలేకరు లతో మాట్లాడారు. మా హయాంలో విద్యుత్ సంస్థలను పటిష్ట చేశామ ని, ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా కాపాడామన్నారు.
ఉత్ప త్తి, పంపిణీ, బిల్లుల వసూలు వర కు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగిం దని గుర్తుచేశారు. ప్రైవేటుకు అప్ప గించే ఆలోచన ఏనాడు కూడా కేసీ ఆర్ చేయలేదని, కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఒప్పుకోలేద ని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM revanth Reddy)పాతబస్తీ ప్రజలను అవమానిస్తు న్నారని, ఆ ప్రాంతం ఆదానీకి అప్ప గించి బిల్లులు వసూలు చేస్తామన డం సీఎం స్థాయికి తగిన మాటలు కావని హితవు పలికారు. సిఎం కు ఏమాత్రం సోయి ఉండి మాట్లా డుతున్నాడా, లేదా అని ప్రశ్నిం చారు. పాతబస్తీలో కేవలం 45 శాతం బిల్లులు వసూలవుతున్నా యనడం వాస్తవం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా 95, 96 శాతం బిల్లుల వసూలవుతున్నాయని వివరించా రు. ఓట్లేసిన ప్రజలను చులకనగా మాట్లాడుతారా ఇందుకేనా మీకు అధికారం అప్పగించిందని నిలదీశా రు. పోలీసులు (police), అటవీ శాఖ అధికా రులపై దాడులు జరుగుతున్నాయ ని, ఈ శాఖలను కూడా ప్రైవేటు వారికి అప్పుజెప్పుతారా అని ప్రశ్నించారు.మోదీ (Modi) ఆదేశాలతో సీఎం రేవంత్ ప్రైవేటీకరణ మొద లుపెట్టారని, ఇందులో విద్యుత్ ప్రైవేటీకరణ తొలిమెట్టు అని చెప్పారు. ఇలాయితే రైతులు ఉచిత విద్యుత్‌ను (free electricity)మరిచిపోవా ల్సిందేనని, వివిధ రకాల కరెంటు సబ్సిడీలు నిలిచిపోతాయని ఆందో ళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తు లు బిల్లులు వసూలు చేస్తే అరాచ కాలు జరుగుతాయని, ఈ విధానా న్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకి స్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలనే బతికించుకోవాలని, వీటి ద్వారానే నాణ్యమైన సేవలు అంతుదుతాయని చెప్పారు. నెలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చినపుడు ఇక ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఎందకని ప్రశ్నించారు. ఎలాంటి ప్రైవేటీకరణకు కూడా బీఆర్‌ఎస్ ఒప్పుకోదని, కేసీఆర్ ఆధ్వర్యంలో కొట్లాడుతామని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు.