Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS Ex minister jagadeeshReddy : పుత్రవాత్సల్యంలో ఏమి మాట్లాడుతున్నాడో ఏమో

పుత్ర వాత్సాల్యంతో విపక్షం పై విమర్శలు చేస్తున్నారు సరే మీరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెలగ బెట్టింది ఏమిటో వివరించాలని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత కుందూ రు జానారెడ్డి ని డిమాండ్ చేశారు.

పుత్రవాత్సల్యంలో ఏమి మాట్లాడుతున్నాడో ఏమో

–సరే కాని జిల్లాకు మీరు ఏమి ఒర గబెట్టారో చెప్పండి
–ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి ఆగింది సంక్షేమం అటకెక్కింది
–బిఆర్ యస్ హయాంలోనే రూ. 75 వేల కోట్లతో అభివృద్ధి
–ధాన్యం దిగుబడిలో రికార్డ్ సృష్టించింది కేసీఆర్ పాలనలోనే
–కేయంఆర్ బి ని కేంద్రానికి అప్ప గించింది మీరు కాదా
–గోదావరిని కావేరి పై మోడీ కుట్రలను అడ్డుకోవ ట్లేదేందుకు
–515 అడుగుల్లో కూడా  పొలాలను ఎండపెట్టింది మీరు కాదా
–అమలు కానీ గ్యారెంటిలతోనే మీరు అధికారంలోకి వచ్చారు
–కాంగ్రెస్ తో వ్యాపార,వాణిజ్య వర్గాలు హడలి పోతు న్నాయి
–వసూళ్లకు ఉత్త మ్ రెడ్డి,కోమటిరెడ్డి లు పోటీ పడుతున్నారు
–సూర్యాపేట కు వచ్చి మాట్లాడడం కాదు 2014 కు ముందు తర్వాత అభివృద్ధి, సంక్షేమాల గురుంచి తెలుసుకో
–మీరు నన్ను విమర్శించడం కాదు మీకు మీరే ఆత్మవలోకనం చేసుకోవాలి
–మాజీ మంత్రి జానారెడ్డి పై సూ ర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం

ప్రజా దీవెన, సూర్యాపేట: పుత్ర వాత్సాల్యంతో విపక్షం పై విమర్శలు చేస్తున్నారు సరే మీరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెలగ బెట్టింది ఏమిటో వివరించాలని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి (Kunduru Janareddy) ని డిమాండ్ చేశారు. 35 సంవత్సరా లు శాసనసభ్యుడిగా 15 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా జిల్లా కు కలిగిన ప్రయోజనం శూన్యమే అన్నారు.

అటువంటి మీరు పుత్రవాత్సల్యం కొద్దీ సూర్యా పేటకు వచ్చి సూర్యా పేటకు జగదీష్ రెడ్డి ఏమి చెయ్యలేదంటూ మీరు చేసిన ప్రకటన అం దుకు కొనసా గింపుగా మరో మాజీ మంత్రి దామో దర్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు మీ విజ్ఞతను బయట పెట్టినట్లయిందని ఆయన దుయ్య బట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగ సూర్యాపేట కు వచ్చిన సీని యర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూ ర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఘాటుగా స్పం దించారు.

ఈ మేరకు ప్రత్యేక వీడియో విడుదల చేశారు.2014 కు పూర్వం ఇ క్కడి ప్రజలు ఎటు వంటి నీళ్లు తాగేదో,సాగు నీరందక సూర్యాపేట ,తుంగతుర్తి రైతాంగాం ఏ తీరుగా అల్లాడి పోయారో సుదీర్గ కాలంగా అదికారంలో ఉన్న మీకు తెలియకపోవచ్చు కానీ తెలంగాణా ఉద్య మ కారుడిగా నాకు బాగా తెలుసని ఆయన ఎద్దేవాచే శా రు.చాలి చాలని విద్యుత్ తో అంది అందని నీటితో ఆత్మక్షోభను ఎదుర్కొంటు న్న రైతాంగాన్ని ఏనాడైనా ఆదుకున్న చరిత్ర తమరికెక్కడదనిఆయన దుయ్యబట్టారు.

ఇక చందాల దందాల గురుంచి మాట్లాడాల్సి వస్తే మీరు వచ్చింది వైట్ హౌసో రెడ్ హౌసో మాకైతే తెలీదు కానీ అక్కడి నుండే కదా చందాల దందాలు సాగిందని ఆయన విరుచుకుపడ్డారు. అటువంటి ఇంటి నుండి మీ లాంటి వారు సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఇక్కడి ప్రజలెవ్వరు విశ్వసించరన్నారు.అధికారంలోకి వచ్చిన నాలు గు నెలల వ్యవధిలోనే 2014 పూర్వ దుస్థితి ఉత్పన్నం కావడంతో సూర్యాపేటలో వర్తక వాణిజ్య వర్గాలు హడలెత్తి పోతున్నారన్నారు.

చివరికి వైద్యులు మీ పార్టీ నేతల అఘాడలతో భయాందోళనకు గుర వుతున్నారని ఆయన మండిపడ్డారు.ఎన్నడూ లేని విదంగా మీ నోటి నుండి కుడా అభివృద్ధి అని రావడం ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజ లను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన ఎత్తి పొడిచారు. అధికా రంలో ఉన్నప్పుడు ఎన్నడూ గుర్తుకు రాని అభివృద్ధి మాట ఇప్పుడు మీ నోట్లో నుండి వచ్చింది అంటే ముమ్మాటికీ అది కేసీఆర్ ఘనత గానే భావించాల్సి ఉంటుందన్నారు.

గడిచిన దశాబ్ద కాలంగా 75 వేల కోట్లతో అటు అభివృద్ధి ని ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన ఘనత నేను మంత్రిగా సాధించిన విజయమే నన్నారు.ఒక్కప్పుడు అన్నానికి అవస్థ పడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరుసగా నాలుగు సంవత్సరాలు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డ్ సృష్టించింది కుడా బి ఆర్ యస్(BRS)ఎలుబడిలోనే అన్నారు.

అటువంటి సుభిక్షంగా ఉన్న రాష్ట్రంలో అబద్ధపు గ్యారెంటిలతో అధికారంలోకి వచ్చిన మీరు నాలుగు నెలల వ్యవధిలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటలు ఎండీ పోయేలా చేసి 2014 కు పూర్వ దుస్థితికి నెట్టేసారని ఆయన ధ్వజమెత్తారు. బి ఆర్ యస్ పాలనలో ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడు సాగర్ లో 510 అడు గుల ఎత్తులో నీళ్లు ఉన్నప్పుడు కుడా పాలేరుకు నీళ్లు ఇచ్చే వంకతో ఎడమ కాలువ కింద భూములకు నీళ్లు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఇప్పుడు 515 అడుగుల ఎత్తులో నీళ్లు ఉండి కుడా పొట్టకు వచ్చిన పంట పొలాలను కాపాడలేక పోయిన ఘనత మీకు మీ పార్టీకి ద క్కిందన్నారు.2,000 ఆసరా ఫించన్ ఇస్తున్న కేసీఆర్ పెద్ద కొడుకని ప్రజలు భావిస్తున్న తరుణంలో చిన్న కొడుకు ను వచ్చిన అధికారం లోకి రాగానే ఆ ఫించన్ ను 4000 కు పెంచి డిసెంబర్ నెల నుండి అందిస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చిన్నకొడుకు కాదు, సవతి కొడుకు కాదు, దొంగ కొడుకు అయ్యిండని ఆయన దెప్పిపొడి చారు.

అంతెందుకు వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించేందుకు గాను ముఖ్యమంత్రి హోదలో కేసీఆర్ ఉంచిన 7,500 కోట్లను కమి షన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు చెల్లించింది నిజం కాదా అని ఆయ న జానారెడ్డి ని సూటిగా ప్రశ్నించారు.పెట్టుబడి సాయం 10 నుండి 15 వేలు చేస్తామన్నారు, రుణమాఫీ(Loan waiver) లక్ష నుండి రెండు లక్షలు అన్నారు,500 బోనస్ తో 2,500 గిట్టుబాటు ధర అన్నారు.

వాటి అమలులో జరుగుతున్న ఉదాసీనత పై జానారెడ్డి వంటి సీని యర్ నేతలు మాట్లాడితే బాగుండెదేమో నని ఆయన హితవు పలి కారు. కంప్యూటర్లు కొనొక్కోవడానికి విద్యార్థులకు ఐదు లక్షల కార్డు లంటీరి,అక్కడెక్కోడో ఉన్న ప్రియాంకా గాంధీ బాధ పడుతుంది ఆమె చెప్పిందంటూ కాలేజీకి పోయే ఆడ పిల్లలకు స్కూటీలంటిరీ, నిరు ద్యోగులకు భృతి అంటూ 420 శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు.

మీరు అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తారని యావత్ నల్ల గొండ ఎదురు చూసింది…అందుకు భిన్నంగా పుత్ర వాత్సల్యంతో ఇక్కడికి వచ్చిన మీరు ఇటువంటి ఆరోపణలు చేయడంతో మీ మీద ఉన్న గౌరవం ఇప్పుడు పాతాళం లోకి పోయిందన్నారు.పైగా అధి కారంలోకి వచ్చి రాగానే కృష్ణా జలాలపై(Krishna river) కేంద్రా నికి హక్కులు కల్పించి ఇక్కడి రైతాంగాన్ని మీరు వంచనకు గురి చేస్తే గోదావరి జలాలను కావేరి లో కలిపే కుట్రలకు మోడీ తెర లేపారని ఆయన ఆరోపించారు.

అటువంటి కుట్రల నుండి కృష్ణా గోదావరి జలాలను కాపాడే శక్తిఒక్క కేసీఆర్ కు మాత్రమే ఉందన్న్నారు.తెలంగాణ తో పాటు పెన మహా రాష్ట్ర ,కర్ణాటక లతో పాటు కింద ఆంద్రప్రదేశ్, తమిళనాడు లలో కాంగ్రెస్, బిజెపి లు ఉన్నందున తెలంగాణా ప్రాంతం హక్కుల గురుం చి, నీటి గురుంచి మాట్లాడలేరు అన్నారు.అటువంటి పరిస్థితి ని గుర్తించి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు బి ఆర్ యస్ ను గెలిపించి కేసీఆర్ కు అండగా నిలబడాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

Jagadeesh reddy vs Jana reddy political war