–మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సవాల్
ప్రజా దీవెన, నకిరేకల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించు కున్న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కి సవాల్ విసురు తున్నానని గడిచిన ఐదేళ్లలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణ నిధుల కేటాయింపు విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ల్యాండ్ ఆక్యు పేషన్ చేసి ఉంటే నా పదవి వదు లుకుంటా నువ్వు వదులుకుంటా వా అని నిలదీశారు. నకిరేకల్ లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిసిన 10 సంవత్సరాలో నువ్వు సాధించింది గుండు సున్నా అంటూ జీవన వ్యాఖ్యలు చేశారు. నువ్వు గతం లో ట్రయల్ రన్ మాత్రమే చేశారని, ఆ ప్రాజెక్టు లో నీరు ఎందుకు నింప లేదని ప్రశ్నించారు. అప్పట్లో కేవలం ఓట్ల కోసమే మోటార్లు అన్ చేసి నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేసా రని, అందుకే ఉమ్మడి నల్లగొండ జి ల్లాలో 11 సీట్లు కాంగ్రెస్ని గెలిపిం చారని తెలిపారు. తెలంగాణ తల్లి రూపకల్పన అనేది పోరాట రూప మని, శ్రమజీవిగా ప్రతిబించించేలా అనేక మంది మేధావులతో చర్చిం చి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుం దని వివరించారు.మూసి ప్రక్షాళన అడ్డుకుంటే నల్గొండ జిల్లా ప్రజలు మూసి లో ముంచుతారని హెచ్చరించారు.మూసి ప్రక్షాళన అయితే రాష్ట్ర ప్రభుత్వం కు ఎక్కడమంచి పేరు వస్తుందో అని అడ్డు కునే ప్రయత్నాలు తీవ్రస్థా యిలో చేస్తున్నారని విమర్శిం చారు.
*సీఎం బహిరంగ సభ విజయ వంతం..* శనివారం నల్లగొండ ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నల్లగొండ జిల్లా కేంద్రంలో బహిరంగ సభ విజయవంతం అయ్యాయని ఎమ్మెల్యే వీరేశం పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇంచార్జీ తుమ్మల నాగేశ్వరరా వు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పార్లమెంట్ సభ్యులు, జిల్లా ఎమ్మె ల్యేలతో కలిసి సభ నిర్వహించామ ని భారీగా జనం హాజరు కావడం తో సక్సెస్ కావడం ఆనందదాయ కమన్నారు. సీఎం మంత్రుల చేతు ల మీదుగా ఇరిగేషన్, పవర్ ప్లాం ట్, మెడికల్ కళాశాలను ప్రారంభిం చుకోవడం జరిగిందన్నారు. నల్ల గొండ, నకిరేకల్ నియోజకవర్గాల పరిధిలో ప్రజల దాదాపు 18 సం వత్సరాల ఎదురుచూపులకు బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు ప్రారం భంతో ఊరట లభించిన ట్లయిo దని అన్నారు. ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయ గా ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు.
గ డిసిన 10 సంవత్సరాలో గత ప్రభు త్వం నిర్లక్ష్యం చేసినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినందుకు ఈ సంద ర్భంగా ఆయన కృత జ్ఞతలు తెలి పారు. బ్రహ్మాణవెల్లంల, పిల్లాయి పల్లి, ధర్మరెడ్డి కాలువను పట్టిం చుకోలేదని, యాదాద్రి పవర్ ప్లాం ట్ జాతికి అంకితం చేసిన జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నార న్నారు. బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు ద్వారా మెదటి విడతలో 50 వేల ఎకరాల్లో నీరు అందిస్తామని ప్రజల కు ఒక్క విశ్వాసం వచ్చిందన్నారు.
సంక్రాంతి తర్వాత రైతు బరోసా ఇస్తామని నిన్నటి సభలో సీఎం రే వంత్ రెడ్డి గంటాపరంగా చెప్పా రని గుర్తు చేశారు. ఈ సమావే శంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, నకిరేకల్ మండల పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి ఏసు పాదం, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదిత రులు పాల్గొన్నారు.