Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagadish Reddy: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన బిఆర్ఎస్ నాయకులు

*సాగర్ కాలువకు గండిపడటానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులుఆధారాలుచూపెడుతున్నారు
*రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి
*పంట నష్టపోయిన రైతుకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

Jagadish Reddy: ప్రజా దీవెన, కోదాడ: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు వద్ద గండిపడి దెబ్బతిన్న ప్రాంతాన్ని మంగళవారం మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ బడుగుల (Harish Rao, Jagadish Reddy, Sabita Indra Reddy, Kodada constituency in-charge of BRS party, former MLA Bollam Mallaiah Yadav, BRS MLAs, MLCs, former MP Badugula.)లింగయ్య యాదవ్ పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagdish Reddy)మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు కాలువ కట్ట మీద పోలీసులను పెట్టి తూములు మూసివేసి గాట్లకు వెల్డింగ్ (Welding)చేసి నీళ్లు పోకుండా చేశారని గేట్లకు వెల్డింగ్ చేయడం వల్ల వరద వచ్చినప్పుడు గేట్లు తెరుచుకోలేక ప్రెషర్‌కు కట్ట కొట్టుకుపోయిందని రైతులు ఆధారాలు చూపిస్తున్నారని తెలిపారు 9 గంటలు నుండి సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇది ప్రభుత్వం సృష్టించిన విలయమని, ప్రకృతి సృష్టించిన విలయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు పంట నష్టపోవడమే కాక మరో రెండు పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడింది అన్నారు ఇక్కడ రైతులు తమ పొలాలను బాగుచేస్తే చాలు, మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు పూర్తిగా ఇసుక మేటలు పేరుకుపోయి రాళ్లు రంపలతో (Stones with saws)పొలాలు నిండిపోయాయి అన్నారు.

ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలలో ఉన్నారని గుర్తు చేశారు. గతంలో ఇలాంటి సమయంలో కేసీఆర్ నిద్రపోకుండా మంత్రులందరిని ప్రజల్లో ఉంచి పని చేయించేవారు ఆయన గుర్తు చేశారు. చేతగాని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం వల్లే ఇలా జరిగిందని రైతులు అంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఇక్కడ జరిగిన నష్టానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలనితెలిపారు పంట కొట్టుకుపోయిన పొలాలకు ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేసారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్లు ఇవి, కొత్తవేమీ కాదు.