Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagadish Reddy: సబితక్కనే చూస్తే వణుకొస్తుందా

— మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ఎద్దేవా

Jagadish Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్ : అసెం బ్లీలో ప్రజా సమస్య లపై ప్రతిపక్ష బీఆరెస్ సభ్యులను మాట్లాడినివ్వ కుండా చేసున్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy)సబితక్కనే చూసి వణికిపోతున్నా డని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఎద్దేవా చేశారు. సభ నుంచి వాకౌట్ చేసి, పోలీసులతో బలవంతంగా తెలంగాణ భవన్ కు తరలించబడి న బీఆరెస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) మీడియా తో మాట్లాడారు. జగదీశ్ రెడ్డి మా ట్లాడుతూ కేసీఆర్ సభకు రావాలని మాట్లాడు తున్న కాంగ్రెస్ లిల్లిపుట్ల కు దమ్ముంటే కేసీఆర్ తరుపున సబితక్కకు రెండు నిమిషాల సమ యం మాట్లాడేందుకు ఇవ్వాల న్నారు.

సబితక్కకు (sabitha) రెండు నిమి షాలు సమయం ఇవ్వడానికి వణికి పోతున్న మీకు కేసీఆర్(kcr) దేనికి రా అంటూ మండిపడ్డారు. సబిత మైక్ అడిగితే రూల్స్ మాట్లాడుతూ పిరి కిపందల్లా చర్చకు పారిపో తున్నా రన్నారు. ఊర కుక్కల్లాగా సబితక్క పైన, తెలం గాణ మహిళాలోకంపైన సభలో ఎట్లా విరుచుకుపడు తు న్నారో తెలంగాణ సమాజం చూ స్తుందన్నారు. నీవు గతంలో తుపా కులు పట్టి తిరిగిండొచ్చు కాని ఈరో జు సీఎంగా ఉన్నావని గర్తు పెట్టు కోవాలన్నారు. ఈ రోజు ప్రజలు అల్పబుద్దివారికి అధికారమిచ్చిన అనే వేమన శతకాన్ని గుర్తు చేసు కుంటున్నాన్నారు. సబితా ఇంద్రా రెడ్డి (Sabita Indra Reddy)మాట్లాడుతూనేను సమయమ డిగితే రూల్స్ చెబుతున్నారని, మరి ఆదివాసీ మహిళయైన మా ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి ఎస్సీ వర్గీకరణ మీద రెండు నిమిషాలు మాట్లాడుతానం టే కూడా మైక్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి (Vemula Prashanth reddy) మాట్లాడుతూ మా మ హిళా శాసన సభ్యులను కన్నీళ్లు పెట్టించినందుకు నీకు తగిన శాస్తి త్వరలోనే జరుగు తుందని హెచ్చ రించారు.