–జస్టిస్ నసింహారెడ్డి కమిషన్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని ఏ విచారణకైనా సిద్ధమని శాసనస భలోనే చెప్పామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ( Former Minister Jagdish Reddy) గుర్తుచేశారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో ( telangana bhavan)మీడి యా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్లలో అవకతవక లు జరిగాయని ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసిందని, గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలపై విచారణ చేస్తుందని, ప్రభుత్వ పెద్దలు, బీజేపీ (bjp) పెద్దలు కొన్ని సందేహాలు లేవనెత్తార ని వివరించారు. అసెంబ్లీలో అన్నిటి కీ సమాధానం ఇచ్చామని, శ్వేత పత్రాలు కూడా విడుదల చేశామని చెప్పారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నిన్న కేసిఆర్ (kcr) వివరణ కోరారు, కమిషన్ సందేహాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారని, పవర్ కమి షన్ ఉద్దేశం వేరేలా కనిపిస్తోందని, కమిషన్ పాత్ర పైన కూడా మాట్లా డారని, వాదన వినకుండా విచారణ కాక ముందే తీర్పు ఇచ్చేలా ఉన్నా యని, మీకు ఆ అర్హత లేదని మీరు కమిషన్ బాధ్యత నుంచి తప్పుకో వాలని కేసిఆర్ సూచిస్తూ అన్ని ఆ ధారాలు చూపించారని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.కేసిఆర్‌కు (kcr) ఆ హక్కు ఉందని, 30 వరకు అవకాశం ఇవ్వా లని అడిగితే లేదు 15నే కావాలని అడిగితే ఇచ్చారని, జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి మారిపోయారని, తెలంగాణ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మారిపోయారని చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలం గాణగా మార్చిన కేసిఆర్ పట్ల న ర్సింహారెడ్డికి సానుభూతి ఉంటుం దనుకున్నాo కానీ ఆయన తీరు అలా లేదని, తన అభిప్రాయం ముందే మీడియా ముందు చెప్తు న్నాడని ఇది తప్పని జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) వ్యాఖ్యానించారు.