–ఎమ్మెల్యేల చేరికలపై న్యాయపోరాటం వెళ్తాం
–రేవంత్ గేట్లు ఓపెన్ చేస్తే తమకు సుప్రీం కోర్టు గేట్లు ఉన్నాయి
–మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: పార్టీ రాత్రిళ్లు మారాలని ఇంటింటికీ తిరిగి ప్రలోభాలకు గురిచేస్తున్నారని సీఎం రేవంత్ (CM REVANTH)గేట్లు ఓపెన్ చేస్తే, తమకు సుప్రీం కోర్టు గేట్లు ఉన్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. దేశంలో పార్టీ ఫిరాయింపులు మొ దలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY) అని స్పష్టంచేశారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ది గురివింద గింజ వైఖరి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి తెలంగాణ వ్యతి రేక నాయ కుల సంకలో రేవంత్ ఉన్నారని. పా ర్టీ మారాలని రాత్రిళ్లు ఇంటింటికీ తిరిగి ప్రలోభాలకు గురిచేస్తున్నరని ఆరోపించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే (CONGRESS PARTY) అని గుర్తు చేశారు.