Jahangir: ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి :యాదాద్రి భువనగిరి మోటకొండూర్ మండలంలోని చందేపల్లి గ్రామానికి చెందిన ఎర్ర జహంగీర్ ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగం హెడ్ ( అధిపతి ) గా నేడు ప్రొఫెసర్ వై జహంగీర్ ( మాదిగ ) పదవి బాధ్యతలు స్వీకరించారు. 50 ఏళ్ల ఉస్మానియా యూ నివర్సిటీ చరిత్రలో దళిత ముద్దుబిడ్డ దళిత వర్గాల మార్గద ర్శకులు ఎర్ర జహంగీర్ మాదిగ మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగం హెడ్ గా నియమి తులయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా సీనియర్ ప్రొఫెసర్లు మరియు ప్రొఫెసర్లు మరి యు నా సహోద్యోగులందరికీ ధన్య వాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ (Business Management) విభాగం హెడ్ గా (head) నియమితులవ డం నాకు ఒక గొప్ప అవకాశం భా విస్తునని అని, నా విభాగానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. అనుబంధ కళాశాలలు మరియు రీసెర్చ్ స్కాలర్లు మరియు విద్యా ర్థుల అందరికీ ధన్యవాదాలు తెలి పారు. ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం హెడ్ గా ప్రొఫెసర్ వై జహంగీర్ మాదిగ నియామకం కావడంతో చందేపల్లి గ్రామంలోని పెద్దలు, యువకులు, గ్రామస్తులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
