*న్యాయవాదులపై దాడి చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలి.
Janagama Police Station: ప్రజా దీవెన, కోదాడ: జనగామ పోలీస్ స్టేషన్ (Janagama Police Station)లో న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఫెడరేషన్ (Federation of Bar Associations) ఇచ్చిన పిలుపుమేరకు కోదాడలో బర్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోర్ట్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం (Statue of Telangana Mother) వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎస్ ఆర్ కె. మూర్తి మాట్లాడుతూ మహిళా న్యాయవాది అని కూడా చూడకుండా పోలీసులు ఆమెపై దాడికి పాల్పడడం దారుణం అన్నారు. బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరలా ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల. నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల. రామిరెడ్డి, బార్ అసోసియేషన్ సభ్యులు కోడూరు.వెంకటేశ్వరరావు,మంద వెంకటేశ్వర్లు, దొడ్డ శ్రీధర్,ఎస్ కే నాగులపాషా, నవీన్, హేమలత,బాదే.దుర్గ, ధనలక్ష్మి,సీనియర్ న్యాయవాదులు మేకల. వెంకట్రావు, వీ. రంగారావు, సిలివేరు.వెంకటేశ్వర్లు, పాలేటి. నాగేశ్వరరావు, ఈదుల. కృష్ణయ్య, శాస్త్రి, శరత్ బాబు, అబ్దుల్ రహీం,ఉసిరికాయ రవికుమార్, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు , నజీర్, ఉయ్యాల నరసయ్య, దావీదు,రియాజ్, రామకృష్ణ ,నాగుల్ మీరా, వెంకటాచలం, కొండ భీమయ్య, మురళి, శరత్, శ్రీనివాస్ , శ్రావణి సంధ్య న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.