–బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్య క్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
Janardhan Goud : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: విద్యా ర్థుల బలిదానాలు పోరాటాలతోటే తెలంగాణ రాష్ట్రం సాకారం అ యిందని బీసీ విద్యార్థి సంఘం జి ల్లా అధ్యక్షుడు అయితగోని జనా ర్దన్ గౌడ్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సకారంతోనే కేసీఆర్, రేవం త్ రెడ్డి లు ముఖ్యమంత్రి కాగాలి గారని అన్నారు. సోమవారం బీసీ విద్యార్థి సం ఘం జిల్లా కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనా ర్దన్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి పీఠం మీద కూర్చున్నాక తెలంగాణ కోసం పోరాడిన విద్యా ర్థులను అక్కున చేర్చుకునేది పో యి ఉన్నత విద్యను ఆటకెక్కిస్తూ పేద విద్యార్థుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ద్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల స మస్యల పరిష్కరించడంలో పూ ర్తిగా విఫలమైందన్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు విడుదల చేయాలని ఒకవైపు విద్యార్థి లోకం అడుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాలేజీ వి ద్యార్థులకు ఇవ్వకుండా కాంట్రా క్టర్లకు వేల కోట్ల రూపాయలు రా త్రికి రాత్రి విడుదల చేస్తూ వారికి దోచిపెడుతుందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో పీజుల బకా యిలుగా ఉన్న 4600 కోట్ల రూపా యలను తక్షణమే విడుదల చే యాలని డిమాండ్ చేశారు.ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల వలె బిసి విద్యార్థులకు కూడా పూర్తి ఫీజుల రియంబర్స్ మెంట్ అమలు చేయా లన్నారు. ప్రవేట్ యూనివర్సిటీలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సా మాజిక రిజర్వేషన్ లు అమలు చేయాలని కోరారు. యూనివ ర్సిటీలలో చదివే విద్యార్థుల పూర్తి మేస్ బిల్లులను ప్రభుత్వమే భరిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయ కులు నర్సింగ్ శివకుమార్, కన్న బోయిన పరమేష్ యాదవ్ , శంక ర్ ఏర్పుల శ్రవణ్, మహేష్ , పృథ్వీ రాజ్ ,మణికంఠ ,సతీష్ ,హరికృష్ణ ,శివకుమార్ తదితరులు పాల్గొ న్నారు.