–బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్య క్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
Janardhan Goud : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సం ఘం, బీసీ రాజ్యాధికార సమితి , విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సమగ్ర కులగనన సర్వే రిపోర్ట్ ని నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవా రం దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయి తగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ
ప్రభుత్వ ప్రకటించిన కులగనల రిపోర్టును తిరస్కరిస్తున్నాం2014 నుంచి 2024 వరకు 21లక్షల మంది బిసిలను తక్కువ చేసి చూపించారన్నారు. ఈ డబ్ల్యూస్ రిజర్వేషన్లను కాపాడడం కోసం లేని అగ్రకులాల జనాభాను చూ పించడం పెద్ద కుట్ర బిసిలను మో సం చేసిన కాంగ్రెస్ పార్టీ భారీ మూ ల్యం చెల్లించక తప్పదన్నారు. బీసీ సబ్ కమిటీ లో భట్టి ,పొన్నం ఉండా లి కానీ ఉత్తమ్ ఎలా ఉంటాడని ప్రశ్నించారు. సమగ్ర కుల సర్వే రిపోర్ట్ ను ప్రజల ముందు బయట పెట్టాలని, మళ్ళీ బీహార్ తరహా లో రెండో సారి కుల గణన సర్వే చే యాలని డిమాండ్ చేశారు. బీసీ లను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ బీసీ కులాల లెక్కలను త గ్గించి అవమానించిందన్నారు.
రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఒక్క రాష్ట్రంలో కుడా సరిగ్గా కుల గనగన నిర్వహించలేని కాంగ్రెస్ దేశమంతా ఎలా నిర్వహిస్తుందో రాహుల్ గాంధీ చెప్పాలి .ఈ కార్య క్రమంలో విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదు లు ,బిసి జేఏసీ చైర్మన్ పెండెం ధ నుంజయ్ ,బిసి రాజ్యాధికార స మితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి ,విజయ్ కుమార్, సతీష్, మహేష్ ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.