Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jasti Subbarao: ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి:డా:జాస్తి సుబ్బారావు.

Jasti Subbarao:: ప్రజా దీవెన,కోదాడ: స్థానిక ఎమ్మెస్ కళాశాలలో ద్విత్యాసం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సర విద్యార్థులు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ యం.ప్రసాద్ అధ్యక్షత శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ ప్రముఖ వైద్యులు డా:జాస్తి సుబ్బారావు పాల్గొని ముందుగా సరస్వతి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసినారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని,మనిషిని మనిషిగా గౌరవించాలని అన్నారు.

పట్టుదలతో ఏదైనా సాధింప వచ్చని,విద్యార్థులు ఎప్పటికప్పుడు నూతన విషయాల పట్ల పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.ఈ నాడు యువత గంజాయి,మత్తు పదార్ధాల కు బానిసలు అవుతున్నారని వాటి నివారణకు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,యాజమాన్యాలు అవగాహన కల్పించాలన్నారు.వ్యాయామానికి ప్రతి ఒక్కరూ సమయం కేటాయిస్తే మనిషి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు.

ఈ కార్యక్రమంలో యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి,సీ ఈ ఓ యస్ యస్ రావు,శ్రీ సాయి వికాస్ డిగ్రీ తేజా ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్ పి.గంగాధర్,యాదగిరి రెడ్డి,అధ్యాపకులు పాషా, వీరస్వామి,వెంకటరెడ్డి,z.శ్రీనివాసరావు,b.శ్రీనివాస రావు,రహీమ్,ఇనుద్దీన్,కల్పన,సునీత సిబ్బంది బ్రహ్మం,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.కళాశాల నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథి బహుమతులు అందజేశారు. అతిధులని విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి