Jayaraju: ప్రజా దీవెన, భువనగిరి: యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు ఎ. జయరాజు భువనగిరిలోని సబ్ జైలును (Sub Jail) సంద ర్శించారు. జైలులో ఉన్న ఖైదీలతో ముఖాముఖి జరిపి వారు కోర్టుకు హాజరు అవుతున్నారా లేదా వారి కేసులలో న్యాయవాదులు లేకున్న ట్లయితే న్యాయసహాయంకై న్యా యవాదులను నియమించటానికి దర ఖాస్తు సమర్పించాలని తెలిపి, జైలులో ఏర్పాటుచేసిన న్యాయ సహాయ శిభిరాన్ని తనిఖీ చేసారు మరియు జైలులో ఖైదీలకు కల్పిస్తున్న వసతులు పరీక్షించి తగు సూచనలు చేసారు.ఈ కార్యక్రమంలో ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఇంచార్జి కార్యదర్శి వి. మాధవిలత, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు(Civil Judge d. Nageshwar Rao), అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. కవిత, జైలు సూపరింటెండెంట్ పాల్గొన్నారు.
తదుపరి కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షులు ఎ. జయరాజు (Jayaraju) మాట్లాడుతూ శనివారం 28.9.2024 రోజున
జాతీయ లోక్ ఆదాలత్ అన్ని కోర్టుల ప్రాంగణములో ఉదయం 10 గం. ల నుండి నిర్వహించబడుతుందని, ఈ లోక్ ఆదాలత్ లో రాజీ పడదగు అన్ని క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకు లావాదేవీలు, టెలిఫోన్ బకాయిలు, ట్రాఫిక్ చాలాన, ఇపెట్టి కేసులు, మోటారు వాహన ప్రమాద నష్ట పరిహారం, ఎక్సయిజ్ కేసులు పరిష్కరించబడునని, దీనిని కక్షిదారులు ఉపయోగించుకువాలని తెలిపారు.