Jazula Lingangaud : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సమగ్ర కులగణన రిపోర్ట్ ను వ్యతిరేకిస్తూ దీనిని పున: సమీక్షించాలని కోరు తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సమర్పించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కులగణన సర్వే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని కులగణ సమగ్రంగా, సం పూర్ణంగా,శాస్త్రీయంగా ఎక్కడా జరగలేదని అన్నారు. బీసీల లెక్క ను తక్కువ చేసి,అగ్రకులాల జనా భాను ఎక్కువ చూపారని అన్నా రు.స్థానిక సంస్థల ఎన్నికల్లో జనా భా దామాషా ప్రకారం 42% రాజకీ య రిజర్వేషన్లు కల్పిస్తామని కామా రెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించి ఇప్పుడేమో కాకమ్మ కథలు చెబు తూ పార్టీ పరంగా 42% రిజర్వే షన్లు మేము ఇస్తామని సీఎం రేవం త్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు .
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కులగణనలో జరిగిన తప్పులను సరిచేయాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకో వాల్సి వస్తుందన్నారు. ఈ కార్య క్రమంలో బంటు వెంకటేశ్వర్లు దోనే టి శేఖర్ నక్క నాగరాజు తదితరు లు పాల్గొన్నారు.