–శాసనమండలి సభ్యుడు జీవన్ రెడ్డి స్పష్టీకరణ
–ఉప ముఖ్యమంత్రి భట్టితో చర్చ లు సఫలం
–జీవన్ రెడ్డి మంతనాలు జరిపిన భట్టి విక్రమార్క,దుద్దిళ్ల శ్రీధర్ బాబు
Jeevan Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) స్పష్టికరించారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) లోనే ఉంటానని, సంజయ్ చేరిక విషయంలో మనస్థాపం చెందానని పేర్కొన్నారు. తాను ఇప్పుడు ఎమ్మె ల్సీగా ఉన్నానన్నారు. ఎమ్మెల్సీ గా అసెంబ్లీకి (assembly) వెళ్ళే హక్కు తనకు ఉంద ని తన కార్యకర్తలు తీసుకున్న నిర్ణ యానికి కట్టుబడి ఉంటానన్నారు. కాగా, బిఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజ య్ కుమార్ కాంగ్రెస్ లో చేరిక విష యం తనకు ముందు చెప్పలేదం టూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) కినుక వహించారు. అసహనంతో పార్టీని విడతానంటూ ప్రకటన కూడా చేశారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి శ్రీధర్ బాబు ను (Sridhar Babu)జీవన్ రెడ్డి ఇంటికి పంపింది. వారిద్దరూ నేతలు జీవన్ రెడ్డి తో మంతనాలు జరిపారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ తన అభి ప్రాయాలను భట్టికి వివరించానని చెప్పారు. కార్యకర్తల మనోభావాల ను తాను వెల్లడించానని అంటూ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగు తున్నట్లు చెప్పారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు. మా అందరికీ మార్గ దర్శకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) అనుభవాన్ని ప్రభుత్వ నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించు కుంటామని, కాంగ్రెస్ పార్టీ అధికా రంలో లేని పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలన్ని చట్ట సభల్లో వినిపించిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి. ఈ ప్రభుత్వం నడవడం కోసం వారి ఆలోచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాం. ఎమ్మె ల్సీ జీవన్ రెడ్డి సీనియార్టీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సమచి త ప్రాధాన్యమిస్తూ గౌరవిస్తుంది. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థి తుల్లో పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. పార్టీలో ఉన్న సీని యర్ నాయకులు మనస్థాపం పడితే మేమందరం బాధపడతా మని వ్యాఖ్యానించారు.