Jhansi:ప్రజా దీవెన, కోదాడ:కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళకు రక్షణ కరువైందని, లైంగిక వేధింపులు, హత్యలు, హత్యాచారాలు, గృహ హింస (Lack of protection for women, sexual harassment, murders, murders, domestic violence) మరింత పెరిగాయని పిఓడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ (Jhansi) అన్నారు. పట్టణంలోని స్థానిక లాల్బంగ్లాలో శనివారం ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) సూర్యాపేట జిల్లా 7 వ మహాసభలు కామ్రేడ్ రామలింగమ్మ పీ. లక్ష్మి, వాణిశ్రీల అధ్యక్షతన నిర్వహించారు. మహాసభ ప్రారంభానికి ముందు కోదాడ పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీ నిర్వహించారు ఈ మహాసభలలో మహిళ హక్కుల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ముందుగా పిఓడబ్ల్యు జెండాను ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు రామలింగమ్మ ఆవిష్కరించా మహాసభలను ఉద్దేశించి పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు జి. ఝాన్సీ మాట్లాడుతూ స్త్రీ పురుష సమానత్వం కోసం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమభాగామ్యం కోసం గత అర్ధ శతాబ్దంలో పిఓడబ్ల్యూ అనేక పోరాటాలు నిర్వహించిందని అన్నారు.
లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గృహహింస నిరోధక చట్టాల (Anti-Sexual Harassment Act, Anti-Domestic Violence Act)కోసం వాటి అమలు కోసం పి ఓ డబ్లు బలమైన పోరాటాలు చేసిందని తెలియజేశారు. పేరుకు మహిళలకు 33 శాతం పార్లమెంటులో చట్టం చేసిన అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక స్త్రీలపై హింస, మతోన్మాదం జరిగిందన్నారు. మహిళా మల్లాయోధుల పై బిజెపి ఎంపీ బ్రీజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డారు. లైంగిక వేధింపుల చట్టం ఉన్నప్పటికీ అతనిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని ఆ చట్ట అమలు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
బిల్కిస్ భానుపై సామూహిక హత్యాచారం (Mass murder), హత్యకు పాల్పడిన వారిని విడుదల చేసి పరోక్షంగా బిజెపి పార్టీ సన్మానించిందని విమర్శించారు. దేశంలో ఈ ఘటనలతో బిజెపి ప్రభుత్వ వైఖరి మహిళల పట్ల స్పష్టపరిచిందని ఆమె అన్నారు. మరొకవైపున భారత రాజ్యాంగ విరుద్ధంగా సి ఏ ఏ, ఎన్ ఆర్ సి, పౌర చట్టాలను తీసుకువచ్చి మత ఉన్మాదంతో వ్యవహరించిందని విమర్శించారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే జాతి పేరుతో భిన్నజాతుల, మతాల సమూహారమైన భారత జాతీయతకు స్పూర్తికి భిన్నంగా బిజెపి పార్టీ వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి మహిళలపై మనువాదన్ని ఒక్కొక్కటిగా వారి హక్కులను హరిస్తూ అణిచివేస్తుందని దుయ్యబట్టారు. పితృ స్వామిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూనే నేడు తమ హక్కుల కోసం, భూమి కోసం, ఈ దేశ విముక్తి కోసం పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
అలాగేసిపిఐ (ఎం_ఎల్) న్యూడెమోక్రసీ (New Democracy) జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ ముగింపు ఉపన్యాసం చేస్తూ మహిళలు ఐక్యంగా, సంఘటితంగా తమ హక్కుల కోసం పోరాడాలని అన్నారు. నేడు అన్ని రంగాలలో మహిళలు అభివృద్ధిలో ఉన్న, పని ప్రదేశాలలో అన్ని రకాల హింసలను, దాడులను ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళా పోరాటాలు బలంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం( పి ఓ డబ్ల్యు) జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సమ్మ, మేకల రాజేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు పులుసు సుజాత, బయ్య జయమ్మ, పోలే బోయిన ఐలమ్మ, పి .లక్ష్మి, శాంతమ్మ, గంట కావ్య, సైదమ్మ, ఖాత లింగమ్మ, సామ ఉపేంద్ర, జయసుధ, సంపూర్ణ, వి సంతోష, తదితరులు పాల్గొన్నారు*