— జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
JITESH V PATIL: ప్రజా దీవెన ఖమ్మం: రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో (rains) గోదావరి పరి వాహ క ప్రాంతంలో వరద ప్రవాహం క్రమేపి పెరుగుతూ వస్తున్నదని జిల్లా కలె క్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)జిల్లా భద్రాచల పట్టణం వద్ద 28.07.24 సాయంత్రం 4:16 గంటలకు నీటి ప్రవాహం 53 అడుగుల స్థాయికి చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము (Control room) నంబర్లు కు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.