JNTU VC Kishan Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నూతన జేఎన్టీయూ వీసీ కిషన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా విద్యార్ధి సంక్షేమ సంఘం నేతలతో కలిసి శాలువా కప్పి, పుష్ప గుచ్చం అం దించి శుభాకాంక్షలు తెలియజేసి నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు.ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేయాలని కోరారు. అడ్మిషన్ల నోటిఫికేషన్ ప్రక్రియలో ఏలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని కోరారు.
వీసీ ని కలిసిన వారిలో తెలంగాణ విద్యార్థి యువ జన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బూర శ్రీనివాస్ నిరుద్యోగ జేఏసీ నా యకులు బండి నరేష్ బిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకు లు రవికిరణ్ బీసీ విద్యార్థి సంఘం ఓయు ఇంచార్జీ గోదా రవీందర్ మాల మహానాడు అధ్యక్షులు చంద్రమోహన్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.