Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Job calendar: తూచాతప్పకుండా ప్రతి జూన్ లో జాబ్ క్యాలెండర్

–ప్రతి ఏడాది ఆ నెలలో నోటి ఫికేష న్లు, డిసెంబరులోపు ఉద్యోగాల భర్తీ
–జాబ్‌ క్యాలెండర్‌పై అసెంబ్లీ సమా వేశాల్లో నిర్ణయం
–లోపాల్లేకుండా పరీక్షలు, నియా మకాలు చేపడతాం
–రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివి ల్స్‌కు ఎంపిక కావాలి

Job calendar:ప్రజా దీవెన, హైదరాబాద్‌: రాష్ట్రం లో ప్రతి ఏటా జూన్‌ నెలలో ఉద్యో గాలకు నోటిఫికేషన్లు (Notifications to employers)జారీ చేసి, డిసెంబరులోపు నియామక ప్రక్రి యలు పూర్తి చేస్తామని ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జాబ్‌ క్యాలెండర్‌పై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో (assembly meetings) చర్చించి నిర్ణయం తీసుకుంటా మన్నారు. కష్టపడితే రైల్వే రిక్రూ ట్‌మెంట్‌ బోర్డు, బ్యాంకింగ్‌ నియా మకాల్లో బిహార్‌ రాష్ట్ర అభ్యర్థుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందన్నా రు. ‘‘కేంద్ర సర్వీసుల్లో ఉంటే రాష్ట్రానికి మేలు చేసే అవకాశం ఉంటుంది. మీ గెలుపులో మీ భవిష్యత్తే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది’’ అని సీఎం అన్నారు.

ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల (Water, funding, recruitment) కోసమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందని, తెలంగాణ పోరాటానికి పర్యాయపదం నిరు ద్యోగ సమస్య అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఉస్మానియా, కాకతీ య యూనివర్సిటీలకి చెందిన వేలా ది మంది విద్యార్థుల పోరా టంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందన్నారు. అందుకే తమ ప్రభు త్వం నిరుద్యోగ సమస్య పరిష్కా రానికే తొలి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి రాగానే.. ప్రమాణం చేసిన చోటునుంచే 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు. గత పదేళ్లలో.. ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం నియామకాలు జరగలేదని, యుక్త వయసులో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని, పరీక్షలు రాసి, ఫలితాలు వచ్చేలోపే ప్రశ్నాపత్రాలు జిరాక్స్‌ సెంటర్లకు చేరాయని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ సివిల్స్‌ విజేతలు తమ నడవడికతో పేద వర్గాలకు మేలు చేయాలని, వారి ఆకాంక్షల్ని నెరవేర్చాలని సూచించారు.

కాగా, తాను సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే సమయంలో కోచింగ్‌ కోసం రూ.2 వేలు లభించక ఇబ్బంది పడ్డానని సింగరేణి సీఎండీ ఎన్‌.బలరాం (Singareni CMD N. Balaram) అన్నారు. 50 రూపాయల విలువ చేసే పుస్తకం కొనుక్కునేందుకు వారం రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఈ సందర్భంగా 2023లో సివిల్స్‌కు ఎంపికైన 41 మంది అభ్యర్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రె డ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు రఘురామిరెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.