Jobs in Family Welfare Department ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాలు
-- జాబ్ నోటిఫికేషన్ విడుదల -- 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమెల్) పోస్టులు
ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాలు
— జాబ్ నోటిఫికేషన్ విడుదల
— 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమెల్) పోస్టులు
ప్రజా దీవెన/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తాజాగా తీపికబురు అందించిoది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని పోస్టులను దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్(notification) సైతం విడుదల చేసింది.తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Medical Health Services Recruitment Board) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (female) పోస్టులను భర్తీ చేయనుంది. తాజా నోటిఫికేషన్ వల్ల మహిళలు ఉద్యోగాల ను పొందుతారని తెలంగాణ ప్రభుత్వం( Telangana government) భావిస్తుంది. నోటిఫికేషన్ పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీలు :1520
జోన్ 1 కాళేశ్వరం: 169
జోన్ 2 బాసర: 225
జోన్ 3 రాజన్న: 263
జోన్ 4 భద్రాద్రి: 237
జోన్ 5 యాదాద్రి: 241
జోన్ 6 చార్మినార్: 189
జోన్ 7 జోగులాంబ: 196
*అర్హతలు ఇలా* ….ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేయాలి. మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అనుకొనేవారికి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
రాతపరీక్ష, పని అనుభవం ద్వారా ఎంపిక ఉంటుంది. ఓంఎఆర్(omr)లేదా ఆన్ లైన్ లో ఉంటుంది. ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష(writen test) ద్వారా 80 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ(waitage) కేటాయిస్తారు..దరఖాస్తు ఫీజు రూ.500 తో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25, 2023 ప్రారంభమై సెప్టెంబర్ 19, 2023న ముగియనుంది. కాగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనుకొనేవారు ముందుగా ఈ వెబ్ సైట్ https://mhsrb.telangana.gov.in/ ను సందర్శించాలి.