Johnny Master: ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ (Johnny Master) వివాదం రోజు రోజుకి అనేక మలుపులు తిరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. జానీ మాస్టర్ తన తోటి లేడి డాన్సర్ విషయంలో లైంగికంగా అనేక ఆరోపణలు ఎదురుకున్నాడు. దాదాపు పది సంవత్సరాల వీరి సహచర్యం ఇప్పుడు బీటలు వారింది. సదరు లేడి డాన్సర్, నాకు సినిమా అవకాశాలు ఇప్పిస్తాను అని అంటూనే పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడని, పోలీసు స్టేషన్ లో కేసు పెట్టగా… అయితే ప్రెసెంట్ జానీ మాస్టర్ ని పోలీసులు పరారీలో ఉన్న సరే వెతికి పట్టుకొని అరెస్టు చేసారు పోలీసులు (The police). అయితే అనంతరం ఈ ఘటన తర్వాతే చాల ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి.
ఇందులో మరొక విషయం ఏమిటంటే, అరెస్టు (arrest) చేసిన తర్వాత పోలీసులు జానీ మాస్టర్ ని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లకుండా, ఓ ప్రైవేటు హౌస్ లో విచారణ చేయడం అనేక అనుమానాలకు దారి తీసుతుంది . ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు జానీ మాస్టర్ ని కాపు కాస్తున్నారని ఓ వర్గం వారు విమర్శలు చేస్తూ ఉంటె మరోవైపు మీడియా కూడా ఇదే విషయాన్ని భూతద్దంలో పెట్టి మరి పదేపదే చూపిస్తోంది. దాంతో జానీ మాస్టర్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
ఇది ఇలా ఉండగా తాజాగా జానీ మాస్టర్ (Johnny Master) సతీమణి ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ… జానీ మాస్టర్ అలాంటివాడు కాదని, చాలా మంచి వాడని చెప్పు కొచ్చింది. ప్రస్తుతానికి అయితే పోలీసులు జానీ మాస్టర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా ఓ ప్రైవేటు బంగ్లాలో పెట్టి విచారించడం… చాలా విచారకరం అనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పోతే జానీ మాస్టర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు, బ్లాక్ బస్టర్ కొరియోగ్రఫీ అందిచారు విచారణ లో భాగంగా జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ (remnad) విధించగా, చంచల్గూడ జైలుకు (jail) తరలించారు పోలీసులు.