–టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందా నికి మంత్రి దామోదర్ హామీ
Journalist : ప్రజా దీవెన, హైదరాబాద్ : రాష్ట్రంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పథకాన్ని పగ డ్బందీగా అమలు చేసేందుకు గా ను త్వరలో ఉన్నత స్థాయి సమా వేశం నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.దామోదర్ రాజ నరసిం హా హామీ ఇచ్చారు.బుధవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలి స్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం అసెంబ్లీలోని ఛాంబర్ లో మంత్రి దామోదర్ రాజ నర్సింహాను కలిసి జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమ లుపై చర్చించింది.
అంతేకాకుండా వినతి పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లా డుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమ లుకాక పోవడంతో జర్నలిస్టులు అనుభవిస్తున్న కష్టాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అసలే ఆర్థిక కష్టాలతో జీవితాలు కొనసాగిస్తున్న జర్నలిస్టులకు, వైద్య ఖర్చులు మరింత భారంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి జర్నలిస్టులు వైద్యం పొందే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.
దీనిపై స్పందించిన మం త్రి దామోదర్ రాజనర్సింహా మాట్లా డుతూ జర్నలిస్టులు ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని, త్వరలో నే ఈ సమస్యకు పరిష్కారం చూ పేందుకు ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృం దంలో యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కురి రాము లు, రాష్ట్ర కార్యదర్శి వరకాల యా దగిరి, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు రజనీకాంత్ తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు.