Journalist mega health camp : జర్నలిస్టులకు ఉచిత వైద్యశిబిరం అభినందనీయం
--నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి --జర్నలిస్టులకు అండగా ఉంటామ న్న ఐకాన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ శశాంక్
జర్నలిస్టులకు ఉచిత వైద్యశిబిరం అభినందనీయం
–నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
–జర్నలిస్టులకు అండగా ఉంటామ న్న ఐకాన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ శశాంక్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సమాజంలో ప్రతి జర్నలిస్టు (jour nalist) అనునిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి గురవుతున్నారని, ఆరోగ్య మే తొలివిధి నిర్వహణగా భావించి వ్యక్తిగత ఆరోగ్యం( Per sonal he alth) పై శ్రద్ధ కనబరచాలని నల్లగొం డ మున్సిపల్ చైర్మ న్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కోరారు. మానసిక ఒత్తిడితో అనారోగ్యాల బారి న పడుతున్న జర్నలిస్టులకు ప్రముఖ ఐకాన్ ఆసుపత్రి యాజ మా న్యం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని నల్ల గొండ మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (muncipal chair man), నల్లగొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి లు అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలో నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఐకాన్ హాస్పి టల్ (icon hospital) సౌజన్యం తో జర్నలిస్టులకు నిర్వ హించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ మెగా హెల్త్ క్యాం ప్ (mega health camp) ను అందరు జర్నలిస్టు లు, వారి కుటుం బ సభ్యులు వినియోగించుకుని ఆరోగ్యాన్ని మెరు గుపరచుకోవాల ని సూచించారు.
హైదరాబాద్ కు దీటుగా నల్లగొండలో అత్యధిక వైద్యసేవ లు అంది స్తున్న ఐకాన్ హాస్పిటల్ కు ప్రతి ఒక్కరు సహకారం అందించాలన్నా రు. పేద, మ ధ్య తరగతి వర్గాల ప్రజలకు అందు బాటులో ఉండే విధంగా ఆసుపత్రి నిర్వహకులు కూడా సహకారం అందించాలని అన్నారు.ఐకాన్ హాస్పిటల్ ఎండి కోడే శశాంక్ (Ico n Hospital MD Kode Shash ank) మాట్లాడుతూ జర్నలిస్టులందరూ తమ ఆస్పటల్ సహకారంతో అంది స్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సీనియర్ డాక్టర్ల బృందం, మరియు అత్యాధునిక సాంకేతిక మెడికల్ ఏక్విప్ మెంట్ (State-of-the-art medical equipment) ద్వారా జర్నలిస్ట్ కు టుంబాలకు బీపి, షుగర్, థైరాయి డ్, విష జ్వ రాలు, కీళ్ళ సమస్య లు, ఊపిరి తిత్తుల సమస్యలు, గ్యాస్ట్రో, యూ రో, గుండె, వెన్నె ముక, మెదడు, నరాలకు సంబం దించిన అన్ని రకాల సమ స్యలకు మెడిసిన్ సలహాలు, సూచనలు సేవలందించ నున్నామన్నారు.
నవంబర్ 15 వరకు జర్నలిస్ట్ ల కొరకు ఈ కార్యక్ర మం కొనసా గుతుందని ప్రతి ఒక్కరు మీ, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు కొంత సమయం కేటాయించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సి పల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సి లర్లు కేసాని వేణు గోపాల్ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, మంత్రి కోమటిరె డ్డి వెంక టరెడ్డి పిఏ మధుసూదన్ రెడ్డి, డాక్టర్లు గుండె వైద్య నిపు ణులు డాక్టర్ రవిశంకర్ కన్నా, నరాల వైద్య నిపుణులు డాక్టర్ సాయి మౌనిక చెరుకూరి, గ్యాస్ట్రో వైద్యానిపుణులు డాక్టర్ వై శశింద్ర, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ కడిమి సాయి లావణ్య, ఎముకలు జిల్లా శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ బచ్చు రాజేంద్రప్ర సాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి గాదె రమేష్, ప్రెస్ క్లబ్ శాశ్వత గౌరవాధ్య క్షుడు, సీనియర్ జర్నలిస్ట్ ఫహీం, టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్, జర్న లిస్టులు వెంకట్ రెడ్డి, సల్వాది జాన య్య, హరిప్రసాద్, మేకల వరుణ మ్మ, కంది వేణు, ముచర్ల విజయ్, ఆకాశ్, మేకల రమేష్, భూపతి రాజు, మక్సుద్, ఎన్నమల్ల రమే ష్ బాబు, దండంపల్లి రవికు మార్, ఉబ్బని సైదులు, చింత యాదగిరి, కత్తుల యాదగిరి, పెద్దగోని మధు, కట్ట యాదగిరి, జిల్లా రాజ శేఖర్, చారి, శివ, మధు తదితరులు ఉన్నారు.
Journalist mega health camp